Wednesday, January 22, 2025

ఇక్కడి చట్టాలను అందరూ పాటించాల్సిందే: బిబిసిపై జైశంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలన్నీ ఇక్కడి చట్టాలను పాటించాల్సిందేనని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లెవర్లీకి స్పష్టం చేశారు. బుధవారం న్యూఢిల్లీరో జైశంకర్‌తో క్లెవర్లీ సమావేశమైన సందర్భంగా న్యూఢిల్లీ, ముంబైలోని బిబిసి కార్యాలయాలపై ఇటీవల జరిగిన ఐటి దాడులను ప్రస్తావించారు. జి20 విదేశాంగ మంత్రుల సమావేశం మార్చి 1, 2 తేదీలలో జరగనున్న సందర్భంగా క్లెవర్లీ భారత్‌ను సందర్శించారు.అనేక రంగాలలో పరస్పర సంప్రదింపులు విస్తరించుకోవాలని వారిద్దరూ ఈ సమావేశంలో నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News