రాష్ట్రంలోని కులవృత్తుల్లోని చేతివృత్తుల వారి జీవన ప్రమాణాలు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న లక్ష రూపాలయ పథకం ని రంతర ప్రక్రియ అని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శ నివారం డా.బిఆర్. అంబేద్కర్ సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మం త్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పా ల్గొన్నారు. పథకం తొలిదశ అమలును బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బు ర్రావెంకటేశం కేబినెట్ సబ్ కమిటీకి వివరించారు. అమలు తీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భం గా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ వర్గాల అభ్యున్నతి కో సం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం తపిస్తారని తెలిపారు.
కులవృత్తుల్లోని చేతివృత్తులకు చేయూత నిచ్చేందుకు, ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా లక్ష రూపాయల సాయాన్ని ప్రకటించారని తెలిపారు. శనివారం వరకూ 2.70 లక్షల దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదయ్యాయని వెల్లడించారు. బిసిలకు లక్ష సాయం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. అర్హత కలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదలకు ముందు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రతి నెల 5వ తేదీ లోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఇన్చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధ్దిదారులకు ప్రతి నెల 15న స్థానిక ఎంఎల్ఎల చేతులమీదుగా అందజేస్తామన్నారు. దరఖాస్తుదారులు https://tsobmmsbc.cgg.gov.in వెవ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని,
ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి గానీ సమర్పించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఎంపికైన లబ్ధ్దిదారులు నెలరోజుల్లోపు తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుక్కోవాలని సూచించారు. లబ్ధిదారుల నిరంతర అభివృద్ధి కోసం అధికారులు పర్యవేక్షిస్తారని, నెలలోపు లబ్ధిదారులతో కూడిన యూనిట్ల ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, బిసి సంక్షేమ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.