Monday, December 23, 2024

ప్రత్యేక సెషన్‌లోనే బిసి, మహిళా బిల్లు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  చట్టసభల్లో 33శాతం బిసి రిజర్వేషన్ బిల్లుతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును.. రెండింటినీ ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని శుక్రవారం ప్రగతి భవన్‌లో సమావేశమైన బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని డి మాండ్ చేసింది. బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం నా డు బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా… బిసి (ఒబిసి) బిల్లు, మహిళా బి ల్లు..ఈ రెండు బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా బిఆర్‌ఎస్ ఎంపిలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై పార్లమెంటరీ పార్టీ సుదీర్ఘంగా చర్చించింది. మహిళా సంక్షేమం, బిసిల అభ్యున్నతి కోసం బిఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు కేంద్రాన్ని ఎప్పటికప్పుడు బిఆర్‌ఎస్ తన గళాన్ని వినపిస్తునే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్‌సభల్లో ఎంపిలు లేవనెత్తాలని అధినేత సిఎం కెసిఆర్ సూచించారు. తమ గళాన్ని వినిపించాలని దిశానిర్దేశం చేశారు.
బిసి బిల్లుపై ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ
తమ తమ వృత్తులను తర తరాలుగా నిర్వరిస్తూ దేశ సంపద సృష్టిలో కీలక భాగస్వాములైన సబ్బండ వృత్తి కులాలైన బిసిలకు చట్ట సభల్లో సముచిత ప్రాధాన్యత దిశగా బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం సుదీర్ఘంగా చర్చించింది.ఉత్పత్తిలో భాగస్వాములవుతూ, సభ్య సమాజానికి సేవలందిస్తూ, దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉంటున్న బిసి (ఒబిసి) కులాలను సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో మరింత దేశవ్యాప్తంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం మీద ఉన్నదని సమావేశం అభిప్రాయపడింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బిసిల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది. ముఖ్యంగా.. రాజకీయ అధికారంలో బిసిల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బిసి (ఒబిసి)లకు పార్లమెంట్ అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కాగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత నిర్వహించిన మొదటి అసెంబ్లీ సెషన్‌లోనే (14 జూన్ 2014) బిసి రిజర్వేషన్ బిల్లుపై చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందనే విషయాన్ని సమావేశం గుర్తుచేస్తూ మరోసారి చర్చించింది. తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపి తొమ్మిదేండ్లు గడుస్తున్నా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మౌనం వహిస్తూ, బిసి రిజర్వేషన్లపై తాత్సారం వహించడం పట్ల బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సామవేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్లమెంటు, అసెంబ్లీ చట్ట సభల్లో బిసిలకు సరైన ప్రాధాన్యత దక్కినప్పుడే వారి సమ్మిళితాభివృద్ధి సాధ్యమవుతుందని పునరుద్ఘాటించింది. ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.ఇప్పటికైనా నిర్లక్ష్యం వహించకుండా బిసి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి వారికి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఆమోదం పొందే దిశగా చిత్తశుద్దితో చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని సమావేశం మరోసారి డిమాండ్ చేసింది. సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయం మేరకు బిసి రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ.. బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసారు.
మహిళా రిజర్వేషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం
సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అధినేత సిఎం కెసిఆర్ అధ్యక్షతన సమావేశమైన బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పునరుద్ఘాటించింది. మహిళల్లో దాగివున్న శక్తిని వెలికితీసి వారికి సహకరిస్తూ వారిని అభివృధ్ధిలో భాగస్వాములను చేసినపుడు మాత్రమే ఏ సమాజమైనా కూడా ప్రగతి పథంలో పయనిస్తుందనే వాస్తవాన్ని స్పష్టం చేసింది. ఈ దిశగా అభివృద్ధి చెందుతున్న దేశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదాహరణలతో సహా విశ్లేషించింది. మహిళల భాగస్వామ్యాన్ని రాజకీయ అధికారంలో కూడా మరింతగా పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.

18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటరీ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసే దిశగా బిల్లును ప్రవేశపెట్టాలని బిఆర్‌ఎస్ పార్లమెంటరీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తూ, కేంద్రాన్ని డిమాండ్ చేసింది. కాగా… చట్ట సభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్రం ఏర్పడిన అనంతరం మొట్ట మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిన విషయాన్ని కేంద్రం ఇంతవరకు పట్టించుకోకపోవడంపై సంయుక్త సమావేశం అసంతృప్తిని వ్యక్తం చేసింది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేస్తూ బిఆర్‌ఎస్ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి మహిళా రిజర్వేషన్లపై లేఖ రాశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News