Thursday, March 20, 2025

అలాంటి వాళ్ల ట్రాప్‌లో పడొద్దు

- Advertisement -
- Advertisement -

కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలనుకునే వారితో జాగ్రత్త కులగణన
సర్వేను తప్పుబడితే మీకు మీరు అన్యాయం చేసుకున్నట్లే 22న ఢిల్లీలో జరిగే బిసి
సంఘాల మీటింగ్‌కు రాహుల్‌ను తీసుకొచ్చే యత్నం చేస్తా హైదరాబాద్ నుంచి
హస్తినకు ప్రత్యేక రైలు ఏర్పాటు సూర్యాపేట లేదా హైదరాబాద్‌లో రాహుల్‌కు
అభినందన సభ త్వరలో తేదీ, వేదికపై స్పష్టత బిసిసంఘాల నేతలతో సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎ ప్పుడూ బిసిలకు అండగా ఉంటుందని, పిసిసి అ ధ్యక్షుడిగా పనిచేసిన వారిలో ఎక్కువ మంది బిసి లే ఉన్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కులగణన సర్వే అందరికీ భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని, ఈ కులగణన పునాదిదని, ముందు దానిని అమలు చేసుకొని తరువాత అవసరాన్ని బ ట్టి సవరణలు చేసుకోవచ్చని ముఖ్యమంత్రి పేర్కొ న్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బిసి సంఘా లు మంగళవారం ధన్యవాదాలు తెలిపాయి. బిసి రిజర్వేషన్ బిల్లులకు సోమవారం శాసనసభ ఆ మోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు సిఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, ప్రకాశ్‌గౌడ్, ఆది శ్రీనివాస్, మాజీ రాజ్యసభ సభ్యులు వి. హనుమంతరావు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, దాసు సురేష్, రిటైర్డ్ ఐఏఎస్ కమిషనర్ చిరంజీవులు, గౌడ సంఘం నాయకులు, బాలరాజు గౌడ్ తదితరులు సిఎం ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి వారితో మాట్లాడుతూ గత ప్ర భుత్వం మాదిరిగా కులగణన సర్వే రిపోర్టును తాము లాకర్‌లో దాచుకోలేదని అన్నారు.

తాము చాలా పకడ్భందీగా కులగణన సర్వే చేపట్టామని ఆయన పేర్కొన్నారు. కొంతమంది దుర్బద్ధి ఉన్నోళ్లు ఈ సర్వేలో పాల్గొనలేదన్నారు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కులగణన నిర్వహించి రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ చెప్పారని, దానిని అమలు చేస్తామని ఆయన అన్నారు. ఈ నెల 22న ఢిల్లీలో జరిగే బిసి సంఘాల మీటింగ్ కు రాహుల్ గాంధీ వచ్చేలా ప్రయత్నం చేస్తానని సిఎం చెప్పారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఒక రైలు ఏర్పాటు చేద్దామని, ఆ బాధ్యతను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చూస్తారని ఆయన పేర్కొ న్నారు. ఢిల్లీలో జరిగే బిసి సంఘాల మీటింగ్‌లో రిజర్వేషన్లు పెంపు, జనగణనలో కులగణన చేయాలని ప్రధాన డిమాండ్ పెట్టాలని ఆయన సూచించారు. మనం ఒత్తిడి చేయకుంటే బిజెపి కులగణన చేపట్టబోదని ఆయన పేర్కొన్నారు. బిసి కుల గణను కార్యాచరణలో పెట్టేలా చేసిన ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి అభినందన సభ ఏర్పాటు చేయాలని సిఎం కోరారు. అది సూర్యాపేటలోనా లేక పరేడ్ గ్రౌండ్‌లోనా అన్నది త్వరలోనే నిర్ణయిస్తామని బిసి సంఘాల నేతలతో ఆయన చెప్పారు.

డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశాం…
ఈ బిల్లులో, సర్వేలో తాము కూడా భాగస్వాములు కావడం తమకు గర్వకారణమని, దీనిని బిసి సోదరులు అర్థం చేసుకోవాలని సిఎం రేవంత్ తెలిపారు. దీనిని తప్పుపడితే నష్టపోయేది బిసి సోదరులేనని, కేవలం డాక్యుమెంట్ చేసి వదిలేయకుండా బిల్లు చేశామని సిఎం రేవంత్ అన్నారు. రాజకీయ పరమైన రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల కోసం వేర్వేరుగా రెండు బిల్లులు శాసనసభలో ఆమోదించుకున్నామని ఆయన తెలిపారు. జనగణనలో కులగణన ఎప్పుడూ జరగలేదని, జనగణనలో కులగణనను చేర్చితే సరైన లెక్క తేలుతుందని ఆయన పేర్కొన్నారు. మండల్ కమిషన్ కూడా బిసిల లెక్క 52 శాతం అని తేల్చింది, కానీ, మేం కులసర్వే ద్వారా బిసిల లెక్క 56.36 శాతంగా తేల్చామని, లెక్కతేల్చడం కోసమే స్థానిక ఎన్నికలను వాయిదా వేశామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఈ అభినందనలు రాహుల్‌గాంధీకి అందించాలి
ఈ అభినందనలు నాకు కాదు, ఈ అభినందనలు అందించాల్సింది రాహుల్‌గాంధీకి అని బిసి సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కుల సర్వే నిర్వహించామని ఆయన తెలిపారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ముందుగా జనాభా లెక్క తేలాలని, ఆ లెక్కలకు చట్టబద్ధత కల్పించాలని సిఎం రేవంత్ అన్నారు. అప్పుడే రిజర్వేషన్లు పెంచుకునేందుకు వీలుంటుందన్నారు. అందుకే రాష్ట్రంలో బిసి కుల సర్వే నిర్వహించుకున్నామని సిఎం రేవంత్ అన్నారు. ఇక, కేంద్రం 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కూడా చేయ లేదని, కేంద్రం తేల్చే పనిని మనం చేశామని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని, బిసిల సహకారంతో ప్రభుత్వం వచ్చిందని, మీ సహకారంతో తాము ఏడాదిలోనే ఈ సర్వే నిర్వహించి, బిల్లును శాసనసభ ముందుకు తీసుకొచ్చి దానిని ఆమోదించుకున్నామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

కులసర్వే చరిత్రలో ఒక మైలురాయిగా…
అసెంబ్లీలో ఫిబ్రవరి 4వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. అందుకే ఫిబ్రవరి 4వ తేదీని సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నామని సిఎం రేవంత్ తెలిపారు. అందులో భాగంగానే సబ్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డిని వేశామన్నారు. ఆయన ఎలా న్యాయం చేస్తారని కొందరు అనుమానం వ్యక్తం చేశారని, ఉత్తమ్ కుమార్ సీనియర్ నేత అని, అధికారులకు చెప్పి చేయించే వ్యక్తి అని, అధికారులు ఎలా ఉంటారో తెలుసు కదా ఎటు అంటే అటు బెండ్ చేస్తారని, అందుకే చట్టం తెలిసిన వ్యక్తి ఉత్తమ్ కాబట్టే ఆయన్ను కమిటీ చైర్మన్‌గా వేశామని ఆయన తెలిపారు. డెడికేషన్ కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఇది పెద్ద సమస్య కాదని సిఎం అన్నారు. పక్కా ప్రణాళికతో మంత్రివర్గ ఉపసంఘం, అ తరువాత డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఒక టైం ఫ్రేమ్‌లో కులసర్వే పూర్తి చేశామన్నారు. మొదటి విడతలో కులసర్వేలో పాల్గొనని వారికోసం రెండో విడతలో అవకాశం కల్పించామన్నారు. పూర్తి పారదర్శకంగా కులసర్వేను పూర్తి చేశామని, ఏ పరీక్షలో నైనా మనం చేసిన పాలసీ డాక్యుమెంట్ నిలబడేలా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లెక్కలు తేల్చాలన్నా మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నదే మన ఆలోచన అని ఆయన పేర్కొన్నారు. ఈ కులసర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని సిఎం రేవంత్ తెలిపారు.

సర్వేను వ్యతిరేకించిన పార్టీల నేతలను కొందరు కలుస్తున్నారు..?
గొర్రె కసాయిని నమ్మినట్లు బిసి సంఘాలు పోయి సర్వేలోనే పాల్గొనని వారి మద్ధతు అడుగుతున్నారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్త చేశారు. సర్వే చేసింది తామని, జనాభా లెక్కలు తేల్చింది తామని, కొందరు వెళ్లి సర్వేను వ్యతిరేకించిన పార్టీల నేతలను కలుస్తున్నారని (పరోక్షంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న)ను ఉద్ధేశించి సిఎం అన్నారు. సర్వేకు సహకరించని, సర్వేలో పాల్గొనని పార్టీలు మీకు మద్దతు ఇస్తాయా అని సిఎం రేవంత్‌రెడ్డి బిసి నాయకులను ప్రశ్నించారు. కులం ముసు గులో రాజకీయంగా ఎదగాలనుకునే వారి ట్రాప్‌లో పడొద్దని, ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరేనని సిఎం బిసి సంఘాల నాయకులకు సిఎం రేవంత్ సూచించారు. పునాదిలోనే అడ్డుపడితే మీకు మీరే అన్యాయం చేసుకున్న వారవుతారన్నారు. మీ హక్కుల సాధన కోసం మీరే నాయకత్వం వహించాలని, తాను మీకు మద్దతుగా నిలబడతానని సిఎం పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News