Sunday, December 22, 2024

రాష్ట్రంలో బిసి బంధు పథకం ప్రవేశపెట్టాలి : బిసి సంఘం వినతి

- Advertisement -
- Advertisement -

BC Bandhu scheme should be introduced in Telangana: R krishnaiah

హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి బంధు పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని రాష్ట్ర బిసి సంఘం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేసింది. గురువారం బిసి భవన్‌లో రాష్ట్ర బిసి సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ గత ఆగష్టు నెలలో బిసిలు ఉద్యమించగా వచ్చే సంవత్సరం నుండి బిసి బంధు పథకాన్ని ప్రవేశ పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇచ్చిన వాగ్దానం ప్రకారం బిసి బంధు పథకం ప్రకటించాలని కోరారు.

బిసి కార్పొరేషన్, 12 బిసి కుల ఫెడరేషన్లకు బడ్జెట్ విడుదల చేసి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కృష్ణయ్య కోరారు. సబ్సిడీ రుణాల కోసం ఐదేళ్ళ క్రితం 5 లక్షల 77 వేల దరఖాస్తులు వచ్చాయని, ప్రతి దరఖాస్తు దారుడికి రుణాలు ఇస్తామని అప్పట్లో వాగ్దానం చేశారని గుర్తు చేశారు. గత ఐదేళ్ళుగా బిసిలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయలేదన్నారు. బిసి ఫెడరేషన్లకు పాలకమండళ్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. బిసి కుల ఫెడరేషన్లలో దరఖాస్తు చేసిన వారు మార్జిన్ మని డిపాజిట్ కింద 50 శాతం డబ్బును అప్పులు చేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని వెంటనే వారికి రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రతి బిసి కులానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ చొప్పున 52 బిసి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతమున్న 12 బిసి ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మార్చాలన్నారు.

వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాంగోపాల్ యాదవ్
బిసి సంక్షేమ సంఘం వికారాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాంగోపాల్ యాదవ్ నియమితులయ్యారు. విద్యానగర్‌లోని బిసి భవన్‌లో జరిగిన రాష్ట్ర సమావేశంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అద్యక్షులు ఆర్. కృష్ణయ్య రాంగోపాల్ యాదవ్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ బిసి సంఘాన్ని పటిష్టం చేయాలని సూచించారు. బిసిలందరు సంఘటితంగా ఉండాలని, రాజ్యాధికారం కోసం పోరాడాలని సూచించారు. తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించినందుకు కృష్ణయ్యకు, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణలకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News