Wednesday, January 22, 2025

చట్టసభలలో బిసి బిల్లు పెట్టాలి

- Advertisement -
- Advertisement -

మహిళా బిల్లులో బిసి సబ్ కోటా చేర్చాలి
కేంద్రానికి బిసి సంఘాల డిమాండ్
బిఆర్‌ఎస్ మద్దతుపై వకుళాభరణం హర్షం
బిసి బిల్లుపై తత్సారం చేస్తే దేశవ్యాప్తంగా ఉద్యమం

మన తెలంగాణ / హైదరాబాద్ : పార్లమెంట్లో బిసి బిల్లు పెట్టాలని, అందుకు బిఆర్‌ఎస్ మద్దతు ప్రకటించడం పట్ల రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు హర్షం ప్రకటించారు. ఇందుకు గాను ముఖ్యమంత్రి కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. చట్టసభలలో బిసిలకు దమాషా ప్రకారం ప్రజా ప్రతినిత్యం కల్పించాలనేది ఆ వర్గాల చిరకాల డిమాండ్ అని,  అది నెరవేర్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మహిళా బిల్లులలో బిసి సబ్ కోటా అంశం చేర్చి పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందేలా కేంద్రం నిర్మాణాత్మక కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశలలో బిసి బిల్లును మహిళా బిల్లుల్లో బిసి సబ్ కోటాను చేర్చి చట్టసభలలో బిసిలకు వాటా కల్పించే దిశగా బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని జాతీయ బిసి దళ్ ఆధ్వర్యంలో జరిగిన బిసి ప్రతినిధుల సమావేశం డిమాండ్ చేసింది. బిసిలు చిరకాలంగా ప్రజాస్వామ్యయుతంగా కోరుతున్న ఈ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం వైఖరి పై నిరసన వ్యక్తం చేసింది. ఈ ప్రతినిధుల మహాసభ కాచిగూడ అభినందన గ్రాండ్ హోటల్ లో జరిగింది. బిసి జాగృతి అధ్యక్షుడు కె. మురళీకృష్ణ మేదరి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు రాచమల్ల బాలకిషన్, రాష్ట్ర సంచారకుల, జాతీయ సంఘం అధ్యక్షుడు ఒంటెద్దుల నరేందర్, మేర సంగం రాష్ట్ర నాయకులు సంజీవ, రాష్ట్ర ఎంబిసి అధ్యక్షుడు బెక్కం వెంకట్ పెరక, మహిళా సంఘాల ప్రతినిధులు ఎం భాగ్యలక్ష్మి, అనురాధ గౌడ్, దివ్య యాదవ్, సంగీత, ప్రతిభ, సరస్వతి, వివిధ బిసి కుల సంఘాల ప్రతినిధులు రూబిన్ గౌడ్ బాబాయ్ యాదవ్, చంద్రపాల్ దీకొండ నర్సింగరావు మేరు ,ఎన్ శ్రీనివాస్ నాయీ, రఘుపతి ముదిరాజ్ ,నాంపల్లి శ్రీనివాస్ రజక ,దుర్గేష్ నేత ,ఎం భాగయ్య నాయీ ,తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ వకుళాభరణం ప్రసంగిస్తూ దేశంలో అధిక జనాభా కలిగిన బిసిలకు చట్టసభలలో తగిన ప్రజా ప్రాతినిథ్యం కల్పించకపోవడం ఆప్రజాస్వామ్యకమే అవుతుందన్నారు. ఈ డిమాండ్లను నీరుగార్చడం ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ మౌలికతను దెబ్బతీయడమే నన్నారు . ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో బిసి బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసి తమ నిబద్ధతను కేంద్రం చాటుకోవాలని ఆయన కోరారు. జాతీయ బిసి దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రసంగిస్తూ పార్లమెంట్లో బిసి బిల్లు ప్రవేశపెట్టక పోతే దేశవ్యాప్తంగా బిసిలు ధర్మపోరాటం చేస్తారని హెచ్చరించారు. ఈ అంశంపై వచ్చేనెల మూడవ తేదీన న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా, నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News