Thursday, January 23, 2025

బడ్జెట్ లో బిసిలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి: కవిత

- Advertisement -
- Advertisement -

వికారాబాద్‌: ప్రతి ఏడాది బిసిలకు రూ.20 వేల కోట్ల బడ్జెట్ పెడుతామని కాంగ్రెస్ వాళ్లు చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఆ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు. వికారాబాద్‌లో బిసి సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎంఎల్‌సి కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశామని, జాగృతి ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్నామని, ఉమ్మడి రాష్ట్రంలోనే జాగృతి ఆధ్వర్యంలోనే 20 వేల మందికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు.

తెలంగాణ జాగృతి నుంచి భారత జాగృతిగా మార్చి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని కవిత వివరించారు. ఎప్పుడైతే బిసిలకు న్యాయం జరుగుతుందో అప్పుడే మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని, కొత్త ప్రభుత్వం బిసిలకు అనేక వాగ్దానాలు ఇచ్చిందని, యునైటెడ్ ఫ్రంట్, భారత్ జాగృతి ఆధ్వర్యంలో మూడు డిమాండ్లు చేస్తున్నామని తెలియజేశారు.

తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని కోరామని, వెంటనే కులగణన చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్ చేశారు. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న ఇందిరాపార్కులో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News