Saturday, December 28, 2024

రాష్ట్రంలో ఏఏ కులాలు బిసిల్లో

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో బిసిల్లో అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలను ఏ, బి, సి, డి, ఈ గ్రూపులుగా విభజించారు.
గ్రూపు ఏలో
గ్రూప్- ఏలో సంచార తెగలు తదితర కులాలకు చెందిన వాళ్లు ఉంటారు.
గ్రూప్- బిలో వృత్తిపరమైన సమూహాలు ఉంటాయి.
గ్రూప్- సిలో క్రైస్తవమతంలోకి మారిన ఎస్సీలు ఉంటారు.
గ్రూప్- డిలో ఇతర కులాలు ఉన్నాయి.
గ్రూప్- ఈ లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లిం కులాలు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత, బిసి సంక్షేమశాఖ 2020లో అప్‌డేట్ చేసిన వివరాల ప్రకారం
గ్రూప్- ఏలో 43, గ్రూప్ బిలో 23, గ్రూప్- సిలో ఒకటి, గ్రూప్- డిలో 31, గ్రూప్ -ఈలో 14 కులాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తంగా వెనుకబడిన వర్గాల్లో 112 కులాలు ఉన్నాయి.

గ్రూప్ -ఏలో ఉన్న కులాలు ఇలా…-
అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవర్, గంగపుత్ర, గోండ్ల, వన్యకుల క్షత్రియ (వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి), నెయ్యాల, పట్టపు. బాల సంతు, బుడబుక్కల, రజక (చాకలి, వన్నార్), దాసరి, దొమ్మర, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, మేదరి లేదా మహేంద్ర. మొండిరేవు, మొండిబండ, బండ, నాయీ బ్రాహ్మణ (మంగలి), మంగల, భజంత్రీ. వంశరాజ్/పిచ్చగుంట్ల, పాముల, పార్థి (నిర్షికరి), పంబల. దమ్మలి/దమ్మల/దమ్ముల/దమల, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముల్యాలమ్మవాండ్లు, వీరముష్టి (నెట్టికోటల), వీరభద్రేయ వాల్మీకిబోయ (బోయ, బేదర్, కిరాటక, నిషాది, ఎల్లపి, ఎల్లపు, పెద్దబోయ). గుడాల, కంజర-భట్ట, కెప్మారే లేదా రెడ్డిక, మొండిపట్ట, నొక్కర్, పారికి మొగ్గుల, యాట, చోపేమరి, కైకడి, జోషినంది వాలాస్, వడ్డె (వడ్డీలు, వడ్డి, వడ్డెలు), మండుల, మెహతార్ (ముస్లిం), కునపులి, పాత్ర, పాల-ఈకరి, ఈకిల, వ్యాకుల, ఈకిరి, నాయనివారు, పాలేగారు, తోలగరి, కావలి, రాజన్నల, రాజన్నలు బుక్క అయ్యవారు, గోత్రాల, కాసికాపడి/కాసికాపుడి, సిద్ధుల సిక్లిగర్/సైకల్‌గర్, పూసలతో పాటు అనాథ పిల్లలు, కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులుగా పరిమితమైన కులాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం గ్రూప్- ఏలో చేర్చింది.

గ్రూప్ బిలో ఉన్న కులాలు
ఆర్య క్షత్రియ, చిత్తారి, గినియార్, చిత్రకార, నఖాస్, దేవాంగ, గౌడ్ (ఈడిగ, గౌడ (గమ్మల), కలాలి, గుండ్ల, శ్రీశయన(సెగిడి), దూదేకుల, లద్దాఫ్, పింజరి లేదా నూర్‌బాషా, గాండల తెలికుల, దేవతిలకుల, జాండ్ర, కుమ్మర లేదా కులాల, శాలివాహన. కిరకలభక్తుల, కైకోలన్ లేదా కైకల (సేన్‌గుండం లేదా సేన్‌గుంతర్), కర్ణభక్తులు, కురుబ లేదా కురుమ, నీలకాంతి, పట్కర్ (ఖత్రి). పెరిక (పెరిక బలిజ, పురగిరి క్షత్రియ), నెస్సి లేదా కుర్ణి, పద్మశాలి (శాలి, శాలివన్, పట్టుశాలి, సేనాపతులు, తొగట శాలి). స్వాకులశాలి, తొగటి/ తొగటన వీరక్షత్రియ, స్వకులసాలి, తొగట, తొగటి లేదా తొగట వీర క్షత్రియ. విశ్వబ్రాహ్మణ (ఔసుల, కంసాలి, కమ్మరి, కంచరి, వడ్ల (వడ్ర, వడ్రంగి, శిల్పి), విశ్వకర్మ.
లోధ్, లోధి, లోధా, బోంధిలి, ఆరె మరాఠీ, మరాఠా (బ్రాహ్మణేతరులు), ఆరాకలీస్, సురభి నాటకాలవాళ్లు. నీలి, బుడుభుంజల/ భుంజ్వా/ భద్‌భుంజాలను గ్రూప్ బిలో చేర్చారు.

గ్రూప్- సి ఉన్న కులాలు ఇలా…
గ్రూప్ సిలో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు.
గ్రూప్- డిలో ఉన్న కులాల వివరాలు…
ఆరెకటిక, కటిక, ఆరె సూర్యవంశి, భట్రాజులు, చిప్పొళ్లు (మెర), హట్కర్, జింగర్, కచి, సూర్యబలిజ (కళావంతుల) గానిక, కృష్ణ బలిజ (దాసరి, బుక్క), మాతుర, మాలి (బారె, బారియ, మారార్, తాంబోలి). ముదిరాజ్, ముత్తరాశి, తెనుగోళ్లు, మున్నురు కాపు, లక్కమారికాపు, పస్సి, రంగ్రేజ్/భవసార క్షత్రియ, సాధుచెట్టి, సాతాని (చాత్తాదశ్రీవైష్ణవ), తమ్మలి (బ్రాహ్మణేతరులు), శూద్రకులం. ఉప్పర లేదా సగర, వంజర (వంజరి), యాదవ (గొల్ల), ఆరె, ఆరెవాళ్లు, ఆరోళ్లు, అయ్యరక, నగరలు, అఘముడియన్, అఘముడియర్, అఘముడి వెల్లాలర్, అఘముడి ముడాలియర్. సొండి/సుండి, వరాల, శిష్టకరణం, వీరశైవలింగాయత్/ లింగబలిజ, కురిమి, అహిర్/అహిర్ యాదవ్, గోవిలి/గౌలి, కుల్లకడగి/కుల్లెకడిగి/చిట్టెపు, సారోల్లు/సోమ వంశ క్షిత్రయలు ఉంటారు.

గ్రూప్- ఈలో ఉన్న కులాలు…
అచ్చుకట్టలవాండ్లు, సింగలి, సింగంవాళ్లు, అచ్చుపానీవాళ్లు, అచ్చుకట్టువారు, అచ్చుకట్లవాండ్లు, అత్తర్‌సాయెబులు, అత్తరోల్లు, ధోబీ ముస్లిం/ముస్లిం ధోబీ/ధోబీ ముసల్మాన్, తురకచాకల లేదా తురకసాకల, తురకచాకలి. తుళుక్కవన్నన్, సాకల, సాకల లేదా చాకలస్, ముస్లిం రజక, ఫఖీర్, ఫఖీర్ బుడబుక్కి, ఘంటి ఫకీర్, ఘంటా ఫకీర్లు, తురక. బుడబుక్కి, దర్వేష్, ఫకీర్, గారడీ ముస్లిం, గారడీ సాయెబులు, పాముల వాళ్లు, కాణి/కట్టువాళ్లు, గారడోళ్లు, గారడిగా. గోసంగి ముస్లిం, ఫకీర్ సాయెబులు, గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటు వాళ్లు, ముసల్మాన్ కీలు గుర్రాల వాళ్లు, హజ్జాం, నాయి, నాయి ముస్లిం, నవీద్. లబ్బి, లబ్బై, లబ్బన్, లబ్బా, ఫకీర్ల, బోర్‌వాలే, డీరఫకీర్లు, బొంతల, ఖురేషి, కురేషి/ఖురేషి, ఖసాబ్, మరాఠీ ఖసాబ్, ముస్లిం కటిక, ఖటిక్ ముస్లిం. షేక్/ షైక్, సిద్ది, యాబా, హబ్షి, జాసి, తురకకాశ, కక్కుకొట్టే జింక సాయెబులు, చక్కిటకానేవాలే, తెరుగాడుగొంతలవారు, తిరుగటిగంట్ల, పత్థర్‌పోడ్లు, చక్కెటకారే, తురకకాశలు ఈ గ్రూప్‌లో ఉన్నారు. గ్రూప్ ఏ నుంచి గ్రూప్ ఈలో ఉన్న కులాలు కొన్ని ప్రాంతాల్లో వెనుకబడిన తరగతులుగా గుర్తించారు.

రాష్ట్రంలో బిసిలకు 29 శాతం రిజర్వేషన్‌లు
ప్రస్తుతం రాష్ట్రంలో బిసిలకు 29శాతం రిజర్వేషన్‌లను అమలు చేస్తున్నారు. గ్రూప్- ఏకు 7 శాతం, గ్రూప్- బికి 10శాతం, గ్రూప్ సికి 1 శాతం, గ్రూప్- డికి 7 శాతం, గ్రూప్-ఈలకు 4శాతం రిజర్వేషన్‌లను కేటాయించారు. ప్రస్తుత కులగణన తరువాత ఆయా కులాల సామాజిక, ఆర్థిక, జనాభా, విద్య, ఉపాధి తదితర అంశాలను బేరీజు వేసుకున్న తరువాత ఈ రిజర్వేషన్‌లలో ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆయా కులాల జీవన స్థితిగతుల ఆధారంగా ఒక గ్రూపులో ఉన్న కులాలను ఇంకో గ్రూపులోకి కూడా మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. బిసి కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇప్పటికే స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావును నియమించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News