Monday, December 23, 2024

బిసి కుల గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: గిడుగు రుద్రరాజు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఇచ్చిన హామీల మేరకే ఎపి విభజన బిల్లులో అంశాల్ని అమలు చేస్తామని ఎపిసిసి ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈ సందర్భంగా గిడుగు మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా, పోలవరం పూర్తిగా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్వప్రయోజనాల కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఎపికి ప్రత్యేక హోదాపై పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకున్నామని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. బిసి కుల గణనకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, యువతను ప్రోత్సహించేలా 50 ఏళ్ల లోపు వారికి పార్టీ పదవులు ఇస్తామని గిడుగు వివరించారు. మోడీ అసత్యాలు, అదానీ అక్రమాస్తులను ప్రజలకు వివరిస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News