Thursday, January 23, 2025

బిజెపి వస్తే బిసి సిఎం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సూర్యపేట ప్రతినిధి : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారంలో వస్తే బిసి వ్యక్తిని సిఎంను చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బిజెపిని ఆశీర్వదించి ఓటేయాలని కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిజెపి జనగర్జన సభ జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మో డీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల కో సం పనిచేస్తుండగా బిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కుటుంబాల కోసం పనిచేస్తున్నాయని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం 15లక్షల కోట్ల రూపాయలను మోడీ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ బిసి కమిషన్‌ను ఏర్పాటు చేసి రాజ్యాంగబద్ధ హక్కును క ల్పించి ఆ వర్గాల సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలో బిజెపిని అధికారంలోకి తీ సుకువస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని, కెసిఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా అ ని సవాల్ విసిరారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకుంటూ సమ్మక్క సారక్కల పేరుతో వరంగల్ జిల్లా ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేసిన విషయం తెలిసిందే అన్నారు.

రైతులకు మద్ధతుగా పనిచేస్తూ పసుపు బోర్డు ఏర్పాటు చేసి అన్నిరకాల ఉత్పత్తులకు మార్కెటింట్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కృష్ణ జలాల వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పష్టమైన వైఖరిని ప్రకటించి వివాదాలు లేకుండా  చేశారన్నారు. మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు మరుగుదొడ్లు లేని ప్రతి ఇంటికి అవసరమైన నిధులు అందించామన్నారు. గడిచిన నాలుగు సంవత్సరాలుగా రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి నాలుగు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని, దీని ద్వారా ఒక లక్ష 90వేల మందికి లబ్ధిచేకూరుతుందని వివరించారు. 550 సంవత్సరాలుగా రామమందిర నిర్మాణం అయోధ్యలో జరపాలని కొనసాగుతున్న పోరాటానికి సార్థకత ఏర్పడి వచ్చే జనవరిలో మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నామని, సూర్యాపేట ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సభలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగించగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, గూడూరు నారాయణ రెడ్డి, కడియం రామచంద్రయ్య, నివేదిత రెడ్డి, గొంగిడి మనోహర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News