Wednesday, January 22, 2025

సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలు

- Advertisement -
- Advertisement -

BC Commission member Upendra thanks CM KCR

 

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎంబిసి విద్యార్ధులకు గురుకులాల్లో నేరుగా ప్రవేశాలను కల్పించినందుకు సిఎం కెసిఆర్‌కు ధన్యవాదాలని రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా అందరికి విద్యను అందించాలనే దృక్పథంతో కెసిఆర్ పాలన కొనసాగుతుందన్నారు. ఎంబిసి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అత్యంత వెనుకబడిన కులాలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. గురుకుల పాఠశాలలో ఎంబిసి విద్యార్ధులకు పరీక్ష లేకుండానే ప్రత్యేక కోటాలో నేరుగా అడ్మిషన్లు కల్పించాలని అనేక కుల సంఘాలు విజ్ఞప్తి చేశారు. వాటిని పరిశీలించిన ఎంబిసి విద్యార్థులకు నేరుగా ప్రవేశాలకు ముఖ్యమంత్రి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవకాశంతో నిరుపేద ఎంబిసి విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారని ఆయన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News