Thursday, January 23, 2025

ముగిసిన బిసి కమిషన్ బృందం పర్యటన

- Advertisement -
- Advertisement -

తమిళనాడులో రిజర్వేషన్‌లు, కులగణన పద్దతులు, సంక్షేమ పథకాల అధ్యయనం


మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో శాస్త్రీయంగా రిజర్వేషన్లను అమలు చేయడానికి అవలంభించాల్సిన పద్దతులపై తమిళనాడుకు అధ్యయానికి వెళ్లిన బిసి కమిషన్ బృందం తన పర్యటన ముగించుకుంది. తమిళనాడులో 1960 నాటికే అక్కడి ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లను సాధించుకుంది. న్యాయస్థానాల అభ్యంతరాలను తొలగించుకునేందుకు ప్రత్యేక ప్రశ్నావళిని మేధావుల సాయంతో రూపొందించుకుని అడ్డంకుల్ని అధిగమించి సర్వేను పూర్తి చేశారు. ఈ తరహాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు 50 శాతానికి అన్ని రిజర్వేషన్లును పరిమితం చేశారు. గతంలో నిర్వహించిన జనగణనలో సామాజిక వర్గాల గణనపై పక్కా లెక్కలతో సుప్రీంకోర్టును సైతం తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం ఒప్పించగ లిగింది. ఇక్కడ రిజర్వేషన్ల పరంగా సాధించిన విజయాలపై అధ్యయనం.

చేసేందుకు తెలంగాణ బిసి కమిషన్ బృందం బుధవారం నుంచి శుక్రవారం వరకు చెన్నైలోని ప్రభుత్వ విభాగాల్లో పర్యటించింది. అందులో భాగంగా తమిళనాడు సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌తో తెలంగాణ బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సిహెచ్ ఉపేంద్ర, శుభప్రదపటేల్, కిశోర్‌గౌడ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అమలు చేయాల్సిన రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంభించాల్సిన పద్దతులపై అధ్యయనం చేశామని ఆయన దృష్టికి రాష్ట్ర బిసి కమిషన్ బృందం తెచ్చింది. సిఎం స్టాలిన్‌కు రాష్ట్ర బిసి కమిషన్ పుస్తకాలను అందజేశారు.

తమిళనాడు బిసి కమిషన్ చైర్మన్ జస్టిస్. తనికాచలం, బిసి, ఎంబిసి, మైనారిటీ శాఖల మంత్రి రాజకన్నప్పన్, ముఖ్యకార్యదర్శి కార్తీక్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి అముద, ఇతర ముఖ్య అధికారులతో సమావేశమై అనేక అంశాలపై ఆరాతీశారు. సత్తనాథన్, అంబాశంకర్, జనార్థనం కమిషన్ నివేదికలపై సుధీర్ఘంగా బిసి కమిషన్ బృందం చర్చించింది. అధ్యయనం కొనసాగింపులో భాగంగా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇవికె సంపత్ రోడ్డులోని ద్రావిడ ఉద్యమ నేత ఇవి పెరియార్ రామస్వామి స్మారక స్థలాన్ని వారు సందర్శించారు. శనివారం చెన్నై నుంచి రాష్ట్రానికి బిసి కమిషన్ బృందం తిరిగి వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News