Monday, December 23, 2024

బిసిల సమగ్రాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

బిసిల సమగ్రాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్

మన తెలంగాణ / హైదరాబాద్ : – ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా బిసిలకు విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేయాలని బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో బిసి సంక్షేమ శాఖపై మంత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంక్షేమ శాఖ పనితీరును, ప్రస్తుతం ఉన్న గురుకుల విద్యాలయాలు, బిసి కార్పొరేషన్ రుణాలు , ఆత్మగౌరభవనాలు, ఫెడరేషన్లకు సంబంధించిన అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు.

సంక్షేమాన్ని ప్రజలకు అందించటం ఒక అదృష్టంగా భావించి అధికారులందరూ బిసిల సామగ్రాభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. నిరుపేదలైన బిసి ప్రజల సంక్షేమo, వారిని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడం కోసం నిబద్దతతో కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని బిసిలకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడానికి అందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. బిసి సంక్షేమ శాఖలోని హాస్టళ్ళలో విద్యార్థుల సంఖ్య , అవసరమైన నిధులు , వసతుల గురించి, రాష్ట్రం లోని స్టడీ సర్కిళ్ళలో ఇస్తున్న శిక్షణ గురించి ఈ సమావేశంలో సమీక్షించారు.

గురుకుల పాఠశాలల పనితీరు, విద్యార్థులు సాధిస్తున్న ఉత్తీర్ణత శాతం గురించి మంత్రి ఆరాతీశారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ,అడిషనల్ సెక్రెటరీ పద్మ, ఎంబిసి సిఈఓ అలోక్ కుమార్, మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు, చంద్రశేఖర్, సంధ్య, విమల, శ్రీనివాస్ రెడ్డి , మద్దిలేటి, మంజుల, ఉదయ్ ప్రకాష్, తిరుపతి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News