Sunday, January 19, 2025

మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ మే- 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ జన గణ పట్టికలో 34 కాలమ్స్ పెట్టడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యతిరేకించడం దుర్మార్గం అన్నారు. అదనపు ఖర్చు లేకుండా దేశంలోని కులాల వివరాలను తెలుసుకునే వీలుందన్నారు.

ఎందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించడం లేదని.. బిసిలపై ఎందుకంత వివక్ష అని ఆయన ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాలు మినహాయిస్తే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేశాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలలో ఇంకా తీర్మానాలు చేయలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల తీర్మానాలు చేయాలని జాతీయస్థాయిలో పార్టీ విధాన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో 29 ఒబిసి ఉద్యోగ సంఘాల ప్రతినిధులో పాటు బిసి సంక్షేమ సంఘం నాయకులు గుజ్జు కృష్ణ, రాజేందర్, రామకృష్ణ, నందగోపాల్, రామరాజ్, అనంతయ్య, చంటి, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News