హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని, బిసి ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు పెట్టాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయరాదని డిమాండ్ చేస్తూ మే- ఒకటిన చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు,ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టే జనగణనలో కులగణన చేపట్టాలని కోరారు. పార్లమెంట్ బిల్లు పెట్టి బిసిలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిసి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా శాగంటి రవితేజను ప్రకటించి నియామక పత్రాన్ని ఆర్. కృష్ణయ్య అందజేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులూ జంజిరాల జగదీశ్, భుపేష్‌సాగర్, మున్నూరు రాజు, వేముల రామకృష్ణ, మట్ట జయంతిగౌడ్, చంటిముదిరాజ్, మధు, రఘు, మురళీ పాల్గొన్నారు.
మే 1న చెన్నైలో బిసి ఉద్యోగుల జాతీయ సదస్సు
- Advertisement -
- Advertisement -
- Advertisement -