Tuesday, January 7, 2025

పంచాయతీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరాలి: చిరంజీవులు

- Advertisement -
- Advertisement -

బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి.చిరంజీవులు

మనతెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్లలోనూ బీసీ అభ్యర్ధులు పోటీచేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పిలుపునిచ్చింది. ఆదివారం సిటీ శివారులోని ఘట్‌కేసర్ లోని జేకే కన్వెన్షన్ హాల్ లో గ్రామపంచాయతీ ఎన్నికలు- బీసీల పాత్ర అనే అంశంపై బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్ సంస్థల పరిణామ క్రమాన్ని ఆయన వివరించారు. ప్రజలతో నిత్యం కలిసి ఉండి వారి విశ్వాసాన్ని చూరగొని ఎక్కువ సీట్లను బీసీలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాలు రూపొందించుకోవాలని సూచించారు.

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారినికి మూలం స్థానిక సంస్థలని, ఈ సారి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. శాసమండలి ప్రతిపక్ష నేత మధుసూధనాచారి మాట్లాడుతూ బీసీ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందన్నారు. బీసీలను ఏకం చేసుందుకు కుల సంఘాల నాయకులు కృషిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ తీన్మార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు పార్టీల వారీగా విడిపోకూడదని, కచ్చితంగా గెలిచే విధంగా వ్యూహాత్మక ఎత్తుగడలు అవలంబించాలని విజ్ఞప్తిచేశారు. సమావేశంలో బీసీ నాయకుడు చెరుకు సుధాకర్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్ జడ్పీ చైర్మన్ తుల ఉమాలతో పాటు పలువురు మాట్లాడారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News