- Advertisement -
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బిసి సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా జరిగింది. 42 శాతం రిజర్వేషన్లే లక్ష్యంగా ఢిల్లీలో బిసిలు పోరుగర్జన నిర్వహించారు. బిసి రిజర్వేషన్లకు పార్లమెంటులో చట్టబద్ధత కోసం బిసి సంఘాలు పోరాటం చేస్తున్నాయి. బిసి పోరు గర్జనకు బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలు దూరం కానున్నాయి. ఈ మహాధర్నాకు రావాలని బిజెపి, బిఆర్‌ఎస్‌ను బిసి సంఘాలు ఆహ్వానించాయి. బిసి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. బిసి రిజర్వేషన్లపై బిజెపిది ద్వంద వైఖరి అని తెలంగాణ బిసి సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మండిపడ్డారు.ఈ మహాధర్నాలో ఇండియా కూటమి నేతలు, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు.
- Advertisement -