Monday, December 23, 2024

ప్రశాంతంగా ముగిసిన బిసి గురుకుల ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి గురుకుల ఇంటర్, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గురుకుల ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించారు. పరీక్షకు మొత్తం 88.69 శాతం విద్యార్థులు హజరయ్యారని గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్యబట్టు తెలిపారు. ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు 52,007 మంది విద్యార్థులు, డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు 7,091 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 277 కేంద్రాల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష సజావుగా సాగిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News