Monday, December 23, 2024

బిసి గురుకుల కాలేజీల్లో ప్రవేశ గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

BC Gurukula Colleges Admission Deadline Extension

హైదరాబాద్ : బిసి గురుకుల జూనియర్ కాలేజీల్లో చేరేందుకు గడువును పొడిగించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు బిసి గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ కాలేజీల్లో ఇంటర్ కోర్సుల ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులతో పాటు సీటు వచ్చిన కాలేజీ అడ్రస్, ప్రిన్సిపల్ నెంబర్‌తో సహా mjptbcwreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. మొదటి జాబితాలో సీటు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఈ నెల 20వ తేదీలోగా కాలేజీల్లో చేరాలని ఆయన సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News