Monday, December 23, 2024

ఈనెల 10వ తేదీన బిసి గురుకుల ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్న ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ మల్లయ్య బట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా 295 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. 6,7,8 తరగతుల్లో 5175 ఖాళీలు ఉండగా 69147 దరఖాస్తులు వచ్చాయన్నారు.

Also Read: మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం

వాటిలో 6వ తరగతిలో 1976 సీట్లు ఖాళీగా ఉండగా 28,587 దరఖాస్తులు, 7వ తరగతిలో 1567 సీట్లు ఖాళీగా ఉండగా 21,278 దరఖాస్తులు, 8వ తరగతిలో 1632 సీట్లు ఖాళీగా ఉండగా 19282 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకోసం ఈ వెబ్ సైటు ను సంప్రదించాలని తెలిపారు. (https://mjpabcwreis.cgg.gov.in/) ఈనెల 10న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో సహా 295 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని, ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తి చేశామని వెల్లడించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News