Tuesday, November 5, 2024

బిసి హాస్టల్స్ అద్దెభవనాల పెండింగ్ బిల్లులు చెల్లించాలి

- Advertisement -
- Advertisement -
ప్రభుత్వానికి కృష్ణయ్య డిమాండ్

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి హాస్టల్స్ అద్దె భవనాల బిల్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. గత 8 నెలలుగా మెస్ బిల్లులు చెల్లించక పోవడంతో హాస్టళ్ళకు సరఫరా చేసే నిత్యావసర వస్తువులు, కూరగాయలు, నూనెలు, పప్పులు, చికెన్, గుడ్డు ఇతర ఆహార దినిసులను వ్యాపారస్తులు ఆపివేస్తున్నారని ఆయన తెలిపారు. దీంతో హాస్టళ్ళ మూసివేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో 700 బిసి హస్టళ్ళలలో నివసించే 70 వేలమంది మెస్ చార్జీల బిల్లులు గత 8 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అద్దె భవనాల బిల్లులు, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదని, దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు.

కూరగాయలు, మాసం, గుడ్లు, పప్పులు, నూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల బిల్లులు గత 8 నెలలుగా చెల్లించని కారణంగా హాస్టళ్లకు వాటిని సరఫరా చేసే కాంట్రాక్టుర్లు అప్పుల పాలయ్యారని, నిత్యావసర వస్తువులు సరఫరా బందు చేస్తామని అంటున్నారని దీని వల్ల హాస్టల్స్ మూసివేసే పరిస్థితి ఏర్పడిందని కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలోని దాదాపు మొత్తం బిసి కాలేజీ హాస్టళ్ళు అద్దె భవనాల్లో ఉన్నాయని 9 నెలలుగా అద్దె చెల్లించక పోవడంతో భవన యజమానులు భవనాలు ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారని ఆయన తెలిపారు. వెంటనే అద్దె భవనాల బిల్లులు పాస్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత 10నెలల హాస్టళ్ళ కరెంట్ బిలు బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బిసి వ్యతిరేక వైఖరి మార్చు కోవాలన్నారు. ప్రెవేట్ యునివర్సిటిలలో రిజర్వేషన్లు అమలు చేయాలనిచ కోరారు. రాష్ట్రంలో 295 బిసి కాలేజీ హాస్టళ్లకు, 321 బిసి గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. బిసి విద్యార్థులకు పూర్తి ఫీజులు ప్రభుత్వం చెల్లించాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News