Tuesday, January 7, 2025

ఈనెల 10న బిసి మేధావుల సమావేశం

- Advertisement -
- Advertisement -

సమగ్ర కులగణన, స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ల పెంపుపై చర్చ
జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో సమగ్ర కులగణన, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల పెంపుపై చర్చించేందుకు ఈనెల 10న హోటల్ హరిత ప్లాజా లో బిసి మేధావుల విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచాలనే ప్రధాన డిమాండ్ తో తాము చేసిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర కులగనను చేపట్టిందని జాజుల తెలిపారు.

సమగ్ర కులగణన తర్వాత తదుపరి ప్రభుత్వ కార్యాచరణ నెమ్మదించిందని అలాగే స్పష్టమైన ప్రకటన చేయడం లేదని దీంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు పెంచుతారా? లేదా అనే అనుమానం బిసిలలో కలుగుతోందన్నారు. బిసి రిజర్వేషన్లను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయ నిపుణులు, సామాజికవేత్తలు, మేధావులు, బిసి సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కులగణన, స్థానిక రిజర్వేషన్లపై బిసిల భవిష్యత్ కార్యాచరణ చర్చించడానికి స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు 42 శాతం సాధించడానికి ఉన్న మార్గాలపై విస్తృతంగా చర్చించి మేధావుల సమావేశంలోనే భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశానికినికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులను, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ లను, సామాజికవేత్తలను, ప్రొపెసర్ లను, అఖిలపక్ష రాజకీయ పార్టీలు, అన్ని బిసి సంఘాలను ఆహ్వానించనున్నట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News