Monday, November 18, 2024

గెల్లును గెలిపించండి.. ఈటలను ఓడించండి

- Advertisement -
- Advertisement -
BC Leader R Krishnaiah Slams BJP Govt
హుజూరాబాద్ ఉప ఎన్నికలో బిజెపిని ఓ  డించాలంటూ 120 బిసి సంఘాలు, ఉద్యోగ యూనియన్ల తీర్మానం, పిలుపు

తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకమూ బిసి పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదు, తమ గ్రామాలను తెలంగాణలో కలుపుకోవాలని కర్నాటక, మహారాష్ట్ర బిజెపి నేతలు స్వయంగా డిమాండ్ చేస్తున్నారు బిసి జనగణనకు బిజెపి వెనుకడుగు వేస్తోంది దేశంలోని అసంఖ్యాక బిసి ప్రజలకు బిజెపి ఏం చేసిందో చెప్పాలి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు బిజెపి వ్యతిరేకం యుపి ఎన్నికల్లో కూడా బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై బిజెపి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం

మనతెలంగాణ/ హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఓడించాలని రాష్ట్రంలోని 120 బిసి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ను భారీ మెజార్జీతో గెలిపించాలని నిర్ణయించారు. ఒక్క హుజురాబాద్‌లోనే కాదు ఉత్తరప్రదేశ్‌లో కూడా బిజెపికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని, అక్కడ కూడా బిజెపిని ఓడిస్తామని బిసి సంఘాలు హెచ్చరించాయి. బిసిలకు అన్యాయం చేస్తున్న బిజెపికి ఓటు వేయద్దు అని పిలుపునిచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ఒక్క పథకమూ బిజెపి పాలిత రాష్ట్రాల్లో అమలు కావడం లేదని పేర్కొన్నాయి. కర్ణాటక, మహారాష్ట్రాల బిజెపి నేతలు స్వయంగా తెలంగాణలో తమ గ్రామాలను కలుపుకోవాలని డిమాండ్ చేస్తున్నాయని బిసి సంఘాలు గుర్తు చేశాయి.

బిసి సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు నగరంలోని ఓ హోటల్లో సమావేశమై హుజూరాబాద్ ఉప ఎన్నికపై చర్చించారు. ఈ ఉప ఎన్నికలో బిజెపికి బుద్ధిచెప్పాలని నిర్ణయించారు. టిఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని తీర్మానం చేశారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలను బిసి సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల హక్కుల కోసం, అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. బిసి జనగణనకు బిజెపి వెనుకడుగు వేస్తోందని అన్నారు. ఈ దేశంలో కోట్ల మంది ఉన్న బీసీలకు బిజెపి ఏం పథకాలు అమలు చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు బిజెపి వ్యతిరేకమని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల చూస్తుంటే భయమేస్తోందని అన్నారు.

బిసి బంధు పథకం పెడుతామని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రకటించారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బిసి విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేశారని, గొల్ల, కురుమలను, మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారని స్పష్టం చేశారు. కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని టిఆర్‌ఎస్ ప్లీనరీలో తీర్మానం చేశారని అన్నారు. చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టాలని ప్రధానమంత్రితో మూడుసార్లు చర్చలు జరిపారని, ప్రతి డిమాండ్‌కు సిఎం సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బిసి, ఉద్యోగ సంఘాల నాయకులు దానకర్ణ చారి, రాజారాం యాదవ్, గుజ్జ కృష్ణ, గుండ్రాతి శారదాగౌడ్, విజయేందర్ సాగర్, ఉదయ్ నేత, టి.పల్లవి, సైదులు, వివమ్మ, సుచిత్ర, భాగ్య,రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News