Monday, November 25, 2024

ఖమ్మం కాంగ్రెస్‌లో లొల్లి

- Advertisement -
- Advertisement -

రసాభాసగా జిల్లా కాంగ్రెస్ సమావేశం, ఎఐసిసి పరిశీలకుడి ముందే రచ్చ..రచ్చ మైకు విసిరేసిన విహెచ్
సమావేశం మధ్యలోనే వెళ్లిన భట్టి బిసిలకు టిక్కెట్లు ఇవ్వాలని నినాదాలు
అరుపులు, కేకలతో దద్దరిల్లిన ఆఫీస్ కార్యకర్తలకు సర్దిచెప్పిన పొంగులేటి

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: జిల్లా కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం రచ్చ రచ్చగా జరిగింది. సాక్షాతూ పార్టీ పరిశీలకుల ముందే కాంగ్రెస్ నేతలు టిక్కెట్ల కోసం కు మ్ములాడుకున్నారు. ముఖ్యమంత్రి నినాదాలతో సమావేశం అంతా రసాభాసగా కొనసాగింది. ఈ నెల 17న హైద్రాబాద్ సమీపంలో జరిగే కాంగ్రెస్ విజయభేరి సభకు జనసమీకరణ కోసం మంగళవారం ఉదయం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలంతా హాజరైయ్యారు ఖమ్మం పార్లమెంట్ ఏఐసిసి పరిశీలకులు, మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తోపాటు సీఎల్పీ నేత భ ట్టితో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో -చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎంపి వి. హన్మంతరావు , మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, భద్రాచలం ఎమ్మెల్యే పొందే వీరయ్య ముఖ్యనేతలం తా హాజరయ్యారు.

ఈ సభలో జనసమీకరణ గు రించి కాకుండా టిక్కెట్లు గురించి లొల్లి లొల్లి చే శారు. ఒక సందర్భంలో ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్‌గా అయిన ఎఐసిసి పరిశీలకులు ముం దు కాంగ్రెస్ టిక్కెట్ల ఆశవహులంతా బల ప్రదర్శ న చేశారు. పోటాపోటీ నినాదాలతో సమావేశం గందరగోళంగా మారింది. జై రాయల, జై పోట్ల , జై పొంగులేటి, లాంటి నినాదాలతో కాంగ్రెస్ కార్యాలయం దద్దరిల్లింది. అంతేగాక మరికొందరూ సిఎం, సిఎం అంటూపోటా పోటీగా నినాదాలు చేశారు. సిఎం అభ్యర్థులుగా వారి అనుచరులు పోటీ పడి నినాదాలు చేసుకోవడంతో ఇరువర్గాల మధ్య ఒకింత ఘర్షణ వాతవరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోమాజీ పిసిసి అధ్యక్షులైన వి. హన్మంతరావు మాట్లాడుతుండగా ఈ జిల్లాపై మీ పెత్తనం ఏమిటి అని ఆయనపై రేణుక వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆయన వారిస్తుండగా కార్యకర్తలు గొడవకు దిగారు. తీవ్ర వా గ్వాదం.. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గో బ్యాక్ విహెచ్ అంటూ ఓ వర్గం నినాదాలు చే శారు. దీంతో విహెచ్ ప్రసంగించకుండానే మైకు ను విసిరికొట్టారు. మరోవైపు బిసిలంతా ఉమ్మడి ఖమ్మంలో మూడు జనరల్ స్థానాల్లో ఒక్కటైన బి సిలకు ఇవ్వాలని నినాదాలు చేశారు. మూడు స్థా నాల్ల్లో అగ్రవర్ణాలకు టిక్కెట్లు ఇస్తే సహించలేదని మూడింట్లో రెండు స్థానాల్ల్లో బిసిలకు కేటాయించాలని పట్టుబట్టారు. ఈ గందరగోళం మధ్య సీ ఎల్పీ నేత మల్లు భట్టి తనకు ఏఐసిసి జూమ్ మీటింగ్ ఉందని సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. మాజీ ఎంపి పొంగులేటి కార్యకర్తలను సముదాయించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా తన ప్రసంగం అనంతరం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బయటకు వెళ్ళిపోయారు. మొత్తం మీద గందరగోళం మద్య సమావేశం ముగిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News