Monday, December 23, 2024

కెసిఆర్‌ను సన్మానించిన బిసి నేతలు

- Advertisement -
- Advertisement -

ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలు
జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

BC leaders honoring CM KCR

మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం పట్ల జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం శాసనసభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను ఆయన కలిసి కృతజతలు తెలిపారు. ఈ సందర్భంగా కెసిఆర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాను జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణతో కలిసి ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫీల్ అసిస్టెంట్లను రెండేళ్ల క్రితం విధుల్లో నుంచి తొలగించడంతో నానా ఇబ్బందులకు గురయ్యారు. వారిని తిరిగి తీసుకున్నందుకు ధన్యవాదాలు. ఒకే దఫా 80 వేల ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఏ ముఖ్యమంత్రి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు జారీ చేయలేదన్నారు. ఇది నిరుద్యోగుల పోరాట విజయమన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనతో 7651 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కలిగిందన్నారు.ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు, సభలు, రౌండ్‌టేబుల్ కాన్ఫరెన్స్ లు జరిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చామన్నారు. పది సంవత్సరాల వయో పరిమితి సడలింపులు ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. పాలనలో గ్రూప్- ఉద్యోగాలు కీలకమైనవి. వీటిపై ఉన్నతాధికారులతో సమీక్షించి పూర్తి పోస్టులు భర్తీ చేయాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News