Sunday, December 22, 2024

బిసి కులగణన చేపట్టాలి… పార్లమెంటులో బిసి బిల్లు పెట్టాలి

- Advertisement -
- Advertisement -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి బిసి నేతల వినతి

హైదరాబాద్ : బిసి కులగణన చేపట్టాలని, వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిసి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఈ విషయమై ప్రధానితో మాట్లాడాలని బిసి నేతలు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బిసి నాయకులు గుజ్జ కృష్ణ, డా. నంద కిశోర్, నీల వెంకటేష్, భూపేష్ సాగర్, నందగోపాల్, వేముల రామకృష్ణ, సి. రాజేందర్, రాజ్ కుమార్, మోడి రాందేవ్, మల్లేశ్ తదితరులు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

దేశంలో గత 75 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బిసిలకు ఏ రంగంలో కూడా జనాభా ప్రకారం వాటా ఇవ్వలేదని ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య అన్నారు. . విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో కనీస ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక కులాలకు వారి వారి జనాభా ప్రకారం అన్ని రంగాలలో వాటా ఇవ్వాలని అలా గాకుండా 75 సంవత్సరాలు గడిచినా రాజకీయ, ఆర్ధిక, పాలన రంగాలలో వాటా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టించే బిసిలకు ఆ సంపదను అనుభవించే హక్కు లేదా అని కృష్ణయ్య ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలని కాని మనదేశంలో 56 శాతం జనాభా కలిగిన బిసిలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణచిపెట్టారని ఆరోపించారు. ప్రపంచంలో అణచివేతకు వివక్షకు గురైన అన్ని వర్గాలకు, అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారురని మనదేశంలో పీడిత కులాలను ఇంకా అణచివేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

రాజకీయ రంగంలో బిసిల ప్రాతినిద్యం 14శాతం దాటలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల సేకరించిన గణాంకాల ద్వార తెలిసిందని కృష్ణయ్య అన్నారు. 56 శాతం జనాభా ఉన్న బిసిలకు రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం. పారిశ్రామిక రంగంలో ఒక శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలలో 5 శాతం, ఉన్నత న్యాయ స్థానాలలో 2 శాతం ప్రాతినిథ్యం లేదంటే చట్ట సభలలో బిసిలకు జనాభా ప్రకారం వాటా ఇవ్వవలిసిన ఆవశ్యకతను తెలుపుతోందన్నారు. 56 శాతం జనాభా గల బిసిలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంంటే ఇదేమి ప్రజా స్వామ్యం అని ప్రశ్నించారు.

పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బిసి లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని కృష్ణయ్య కోరారు. కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బిసిల జనాభా ప్రకారం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని కోరారు. బిసిల విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్‌ను తొలగించాలని కోరారు. బిసి.లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని. బీసీల అభివృద్ధికి ప్రత్యేక స్కీములను రూపొందించాలని కోరారు.

కేంద్రమంత్రి హామీ :
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ బిసిలకు అన్నీ రంగాలలో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయినధని, స్వయానా ప్రధానమంత్రే బి.సి, అలాగే కేంద్రమంత్రి వర్గంలో 27 మంది మంత్రులు బి.సి వర్గానికి చెందిన వారున్నారు. ఈ డిమాండ్లు న్యాయమైనవి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి,బిసిల బడ్జెటు పెంచడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయి న్యాయం చేయడం కోసం చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News