సత్తుపల్లి : బీసీలకు ఇచ్చే లక్ష రూపాయలు రుణాల దరఖాస్తు పెట్టుకునే తేదీని జూలై 20 తేది వారికి పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నిరంతర ప్రక్రియ అని చెబుతూనే ఈ పథకం నీరు గారు నిరంతర ప్రక్రియలు అయినప్పుడు దరఖాస్తులు ఎందుకు తీసుకోరా అని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ ప్రశ్నించారు.
దరఖాస్తు తేదీని వచ్చే నెల 20 వరకు పొడిగించి బీసీలకు కుల ఆదాయ ధ్రువపత్రాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత పది రోజులుగా మానుకొని తాసిల్దార్ కార్యాలయం ఈ సేవ కేంద్రాల చుట్టూ తిరుగుతున్న పాలకులకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర బీసీ మంత్రి స్పందించి దీనిపై చర్యలు చేపట్టి బీసీలకు కూడా బీసీ బందు పథకాన్ని అమలు ఈ కార్యక్రమానికి చేసే విధంగా చర్యలు చేపట్టాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల ఐక్యమై కేసీఆర్ ఇంటికి పంపుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్టిపి మండల అధ్యక్షులు శ్రీరామ వెంకటేశ్వరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో శరత్చంద్ర కొండపల్లి వేణుగోపాల్, గుంజ నాగరాజు, రామచంద్రపాక రామచంద్రయ్య, మహాదేవ మురళి, వేముల మారేష్, నాగేశ్వరరావు, వీర లక్ష్మణరావు, గుంజుకుమారి, తమ్మిశెట్టి ఎంకమ్మ, పాలకొల్లు కేశవరావు పాల్గొన్నారు.