Monday, December 23, 2024

బిసి హక్కుల సాధనకు తిరుగుబాటు తప్పదు

- Advertisement -
- Advertisement -

జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

మనతెలంగాణ/ హైదరాబాద్ : బిసిలకు విద్య, ఉద్యోగ, సాంఘిక, ఆర్థిక రంగాలలో అన్యాయం జరుగుతుందని, దీని పై తిరుగుబాటు చేయకపోతే వాటా దక్కదని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. సోమవారం రాష్ట్ర బిసి యువజన సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర బిసి యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బి. యుగేందర్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని 75 కోట్ల మంది బిసిలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుందన్నారు.

బిసిల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేంద్రంలో ఓబిసి రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. అత్యధిక జనాభా గల బిసిలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా అణిచి వేస్తున్నారని కృష్ణయ్య ధ్వజమెత్తారు.

బిసి నాయకులు రాజకీయ పార్టీలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. బిసి లందరూ కలసి కట్టుగా పోరాడే సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమావేశంలో జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ, బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలా వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. యుగేందర్ గౌడ్, బిసి ఉద్యోగులు ప్రధాన కార్యదర్శి ముత్యం వెంకన్నగౌడ్, రాజేందర్, రామకృష్ణ, హేమంత్, అనంతయ్య, నర్సింగ్, బాలరాజ్, నాగరాజు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News