Friday, February 28, 2025

రేపు బిసి రణభేరీ మహాసభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిసి రణభేరీ మహాసభ ను సోమవారం నిర్వహించనున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని, ఇందుకోసం రేపటి నుంచి జరుగనున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బిసిలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని అన్నారు. బిసిలకు కేంద్ర స్థాయిలో ఒక్క స్కీమ్ కూడా లేదని, దశాబ్దాలుగా ఈ వివక్ష కొనసాగుతోందని అన్నారు. రేపటి రణభేరి సభకు అఖిలపక్ష నేతలు వస్తున్నారని కూడా కృష్ణయ్య తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News