Monday, March 17, 2025

నేడు ఎస్సీ వర్గీకరణ, బిసి బిల్లులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం ఎస్సీ వర్గీకరణ, బీసీలకు విద్యాసంస్ధల్లో , స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసే బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. అలాగే బీసీల బిల్లును బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. అలాగే దేవాదాయ శాఖకు చెందిన బిల్లును మంత్రి కొండా సురేఖ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు బిల్లును సభ్యుల ఆమోదం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. కాగా సోమవారం శాసన మండలిలో ఎలాంటి బిల్లులను ప్రవేశపెట్టడంలేదు. కేవలం ప్రశ్నోత్తరాలు మాత్రమే మండలిలో జరుగుతాయి. శాసన సభల్లో బిల్లులను ఆమోదించిన అనంతరం మండలిలో ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News