Saturday, November 16, 2024

పార్లమెంట్‌లో బిసి రిజర్వేషన్ బిల్లు పెట్టాల్సిందే..

- Advertisement -
- Advertisement -
  • చట్టసభల్లో బిసిలకు సముచిత న్యాయం కల్పించాలి
  • తెలంగాణ తరహాలో బిసిలకు ఇతర రాష్ట్రాల్లో బడ్జెట్‌ను కేటాయించాలి
  • కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణలో ఆర్. కృష్ణయ్య, పద్మాదేవేందర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి

మెదక్: ఆనాటి స్వాతంత్ర ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు ఎన్నో పోరాటాలు చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాజ్యసభ స భ్యులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణ య్య గౌడ్ అన్నారు. మంగళవారం జికెఆర్ చౌరస్తా లో స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బా పూజీ విగ్రహావిష్కరణలో స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పద్మశాలి సంఘం ఆ ధ్వర్యంలో జికెఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్. కృష్ణయ్య గౌడ్ మాట్లాడుతూ…. 1975 నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ తనకు ఎంతో సుపరిచితుడని అతని అడుగుజాడల్లో ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నానని అన్నారు.

దేశంలో బిసిలకు సముచిత స్థానం లేదని అందుకొరకై పార్లమెంట్‌లో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసేందుకు కృషి చేస్తానని కృష్ణయ్య అన్నారు. తెలంగాణ తరహాలో బిసిలకు ఇతర రాష్ట్రాల్లో సరైనబడ్జెట్‌ను కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచైన సరే బిసిలకు చట్టసభల్లో సముచిత న్యాయం, పార్లమెంట్‌లో బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసేందుకు కృషి చేస్తానన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజి స్వా తంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చాడని, ఆనాటి ఉద్యమంలో ఎంతో మంది భారతీయులను జాగృతపరిచేవాడన్నారు. అనంతరం రజాకార్ల అరచకపాలనలో తాను పోరాడి వారినుంచి విముక్తి కలిగించిన వారిలో లక్ష్మణ్ బాపూజీ కీలకపాత్ర పోషించాడని గుర్తు చేశారు.

తొలిదశ తెలంగాణ ఉద్యమం లో ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లోనే తనమంత్రి పదవీని సైతం త్యాగం చేసిన ఘనత ఆయనదేనన్నారు. అప్పటినుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పా ల్గొంటూ మలిదశ పోరాటంలో నిరాహర దీక్ష చేసి ఉ ద్యమానికి ఊపిరిపోశారన్నారు. నాలుగు ఉద్యమా ల్లో పాల్గొన్న అరుదైన ఉద్యమకారుడు కొండా ల క్ష్మణ్ బాపూజి అని ఆయన అన్నారు. అతనిది ముక్కుసూటి తత్వమని, జలదృశ్యంలోగల తన స్వంత ఇంటిని సైతం బిఆర్‌ఎస్ కార్యాలయం కోసం వాడుకోమ్మని ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం నెలకొని ఉందన్నారు. 97 సంవత్సరాల సుదీర్ఘంగా జీవించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఎప్పుడు బడుగు, బలహీనవర్గాల వారి అభ్యున్నతి కోసం పా టుపడేవారని కొనియాడారు. అనంతరం శాసనసభ్యురాలు పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ….. బిసిల అభ్యున్నతికోసం ఎప్పుడు పరితపించి పోయే మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు.

అతని విగ్రహాన్ని పట్టణంలో ఏర్పాటు చేసుకోవడం ఎంతో గర్వకారణమని, అతని అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని కోరారు. జలదృశ్యంలో గల తన నివాసంలో సమావేశం అనంతరం 2001లోని తన రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తుచేశారు. మహానీయులకు సముచిత స్థానాన్ని క ల్పించడంలో సిఎం కెసిఆర్ ఎంతో ఆసక్తిచూపడమే కాకుండా వారికి అరుదైన గౌరవాన్ని ఎప్పుడు తగ్గకుండా చూస్తున్నారని ఆమె అన్నారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ… బిసిల కోసం అలుపెరగకుండా అహర్నిశలు కృషి చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. అట్టడుగు వర్గాల కోసం తన సర్వాన్ని సమర్పించిన మహానీయుని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లిఖార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, పద్మశాలి సంఘం జిల్లా అద్యక్షులు జయరాములు, చేనేత సహాకార సంఘం అధ్యక్షుడు బొద్దుల సంతోష్, ప్రధాన కార్యదర్శి శ్రీపాల్, బిసి సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం, చేనేత డివిజన్ అధ్యక్షుడు బొద్దుల కృష్ణ, ఎంపిపిల ఫోరం జిల్లా అధ్యక్షుడు హరిక్రిష్ణ, కౌన్సిలర్లు మేడి కళ్యాణి, రుక్మిణి, ఆర్‌కే శ్రీనివాస్‌తోపాటు గుడ్ల వాణి, అంకం చంద్రకళతోపాటు పలువురు బిసి కుల సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News