Sunday, December 22, 2024

బిసి రిజర్వేషన్ల పెంపుపై కార్యాచరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బిసి రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి కార్యాచరణను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దేశించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేష న్ల అమలు, రాబోయే ఎన్నికల్లో వాటి పెంపునకు సం బంధించిన అంశాలను వెల్లడించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. గత పంచాయ తీ ఎన్నికల అనుసరించిన విధానం, రానున్న పంచాయ తీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే కులగణనకు ఆమోదం తెలిపినందున, దాని ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందని, అందుకు ఎంత స మయం తీసుకుంటారని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. కర్ణాటకలో 2015లో, బీహార్‌లో 2023 లో కులగణన చేశారని, ఆంధ్రప్రదేశ్‌లో కులగణన చేసి న వివరాలు ఇంకా బయటపెట్టలేదని అధికారులు సిఎంకు వివరించారు.

2011లో కేంద్ర ప్రభుత్వం అ నుసరించిన కులగణన ఫార్మాట్ 53 కాలమ్స్ ఉందని, దానికి మరో మూడు కాలమ్స్ జోడించి కుల గణన చేపడితే కనీసం అయిదున్నర నెలల సమయం పడుతుందని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో రిజర్వేషన్ల పెంపు అంశంపై సుదీర్ఘ చర్చ సాగింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర మాజీ మంత్రి కె.జానారెడ్డి, బిసి కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రిజర్వేషన్ల పెంపు సాధ్యాసాధ్యాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పంచాయతీల ఎన్నికలకు సంబంధించి బిసి రిజర్వేషన్ల పెంపుపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించారు.

నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేలా….
బిసి రిజర్వేషన్ల పెంపుతో పాటు స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోకుండా త్వరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసానాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు ఇప్పటి వరకు అనుసరించిన విధానాలపై కాలక్రమేణా పట్టిక రూపొందించాలని, ఏవైనా సందేహాలు వస్తే మాజీ మంత్రి జానారెడ్డితో పాటు పంచాయతీరాజ్ శాఖ నిపుణులు,

మాజీ ఉన్నతాధికారుల సలహాలు తీసుకోవాలని, చట్టపరమైన విషయాల్లో అడ్వకేట్ జనరల్ తో చర్చించాలని సిఎం అధికారులకు సూచించారు. మిగతా రాష్ట్రాలు రిజర్వేషన్ల విషయంలో అనుసరిస్తున్న విషయాలపై అధ్యయనం చేయాలని సిఎం ఆదేశించారు. త్వరగా ఆయా అంశాలపై నివేదిక రూపొందిస్తే శాసనసభ సమావేశాలకు ముందే మారోసారి సమావేశమై ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శి డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి డి.ఎస్.లోకేష్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి రెండ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News