- Advertisement -
హైదరాబాద్: బిసి సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని ఎంఎల్‌సి కవిత తెలిపారు. ఎంఎల్‌సి కవితతో సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య భేటీ అయ్యారు. 26న జలవిహార్‌లో బిసి సంఘం సమావేశానికి ఎంఎల్‌సి కవిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన చేపట్టాలని పదేళ్ల క్రితమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. బిసిల అభ్యున్నతికి సిఎం కెసిఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని కవిత ప్రశంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బిసిల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని, నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో బిసిలకు సముచిత స్థానం కల్పించామన్నారు. బిసిల పట్ల బిఆర్‌ఎస్ చిత్తశుద్ధితో ఉందని కవిత స్పష్టం చేశారు.
Also Read: ఖలిస్తాన్ తీవ్రవాది పన్నున్ ఆస్తులు జప్తు చేసిన ఎన్‌ఐఎ
- Advertisement -