Tuesday, February 11, 2025

స్థానిక రిజర్వేషన్లపై సర్కార్‌కు నివేదిక

- Advertisement -
- Advertisement -

సిఎస్‌కు అందజేసిన
డెడికేటెడ్ కమిషన్ చైర్మన్
బూసాని వెంకటేశ్వర్లు
700పేజీలు.. నియోజకవర్గాల
వారీగా రిజర్వేషన్ల ప్రతిపాదనలు
నివేదిక ఆధారంగా గ్రామ,
వార్డు స్థాయి నుంచి జిల్లా
పరిషత్ చైర్మన్‌దాకా
రిజర్వేషన్లు ఖరారు

మన తెలంగాణ /హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల కోసం బిసి రిజర్వేషన్‌లు ఖరా రు చేయడానికి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ క మిషన్ తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లు సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతికుమారిని కలిసి నివేదికను అందజేశారు. ఈ నివేదిక 700 పేజీల తో ఉ న్నట్లు సమాచారం. డెడికేటెడ్ కమిషన్ స్థా నిక సంస్థను బట్టి రిజర్వేషన్లను నివేదించినట్లు తెలిసింది. నియోజకవర్గాల వారిగా రిజర్వేష న్లు ఖరారుకుప్రతిపాధించినట్లు సమాచారం.

డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ పని ప్రా రంభిస్తుంది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆ ధారంగా పంచాయతీరాజ్ శాఖ గ్రామ వార్డు స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా రి జర్వేషన్లు ఖరారు చేయనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారంరిజర్వేషన్లు ఖరార య్యే అవకాశం ఉంది. ఈ నివేదికపై బిసి సం క్షేమ శాఖ నోట్ ఫైల్ సిద్ధం చేసి సిఎం అనుమ తి తీసుకుని మంత్రివర్గానికి సమాచారం ఇవ్వనుంది. పంచాయతీ శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసి ఇసికి వివరాలు అందించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News