Wednesday, December 25, 2024

స్థానిక సమరంలో..బిసిలకు 42 శాతం?

- Advertisement -
- Advertisement -

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
రిజర్వేషన్లు పెంచనున్న కాంగ్రెస్
ప్రభుత్వం ప్రభుత్వానికి 30న
నివేదిక సమర్పించనున్న డెడికేటెడ్
కమిషన్ అదే రోజు జరిగే
కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం
ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు?

మన తెలంగాణ/హైదరాబాద్ : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లు మారనున్నట్టుగా తెలిసింది. దీంతో బిసి ల్లో చాలామందికి ప్రజాప్రతినిధులకు అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. ఇప్పటికి రా ష్ట్రంలో బిసిలకు 29 శాతం రిజర్వేషన్‌లను అ మలు చేస్తున్నారు. ఆ రిజర్వేషన్‌ల శాతాన్ని పెంచుతామని 2023 అసెంబ్లీ ఎన్నికల హా మీల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొ ని 42 శాతం పైచిలుకు బిసిల రిజర్వేషన్‌ల పెంపు కోసం ప్రభుత్వం పక్కావ్యూహాంతో వె ళుతుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.ఇప్పటికే కులగణనను పూర్తి చేసిన ప్రభుత్వం రిజర్వేషన్‌లను ప్రకటించే దిశగా అడుగులు వే స్తోంది. 30వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశమే ప్రధానం కానుందని తెలుస్తోంది. త్వ రలో జరుగనున్న స్థానిక సంస్థలు, ఎంపిటిసి, జెడ్పిటీసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కీలక అంశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ కేబినెట్ భేటీలో రైతు సంక్షేమ కార్యక్రమాలైన రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయం అమలు, కొత్త రేషన్‌కార్డుల జారీ, బిసిల రిజర్వేషన్‌లకు సంబంధించి కీలక నిర్ణయాలపై కేబినెట్ చర్చించనున్నట్టుగా తెలిసింది.

ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు
ఈ నేపథ్యంలోనే సుమారుగా 42 శాతానికి పైచిలుకు బిసిలకు రిజర్వేషన్‌లకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త ఏడాదిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే జనవరిలో షెడ్యూల్ ప్రకటించి, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో పెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కులగణనను ప్రభుత్వం నిర్వహించింది. అయితే మొదట బిసి కమిషన్ ఆధ్వర్యంలో కులగణన చేసేలా షెడ్యూల్‌ను రూపొందించగా కొంతమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో బిసి కులగణన కోసం డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఆ కమిషన్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని కోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలో 12,941 గ్రామపంచాయతీలు
మాజీ ఐఏఎస్ బుసాని వెంకటేశ్వర్లును కమిషన్ చైర్మన్‌గా నియమించగా డిసెంబర్ 30 వరకు నివేదిక సమర్పించే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. రాష్ట్రంలో 12,941 గ్రామపంచాయతీలు ఉండగా పంచాయతీ ఎన్నికల్లో ప్రతి వార్డుకు ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1,200 ఓటర్లకు ఒక కేంద్రం ఉండగా అదే పంచాయతీకి వచ్చే సరికి వంద ఓటర్ల కంటే తక్కువగా ఉన్నా ఆ వార్డుకు పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంచాలి. అందుకే సిబ్బంది ఎక్కువగా అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పలుచోట్ల మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వానికి ఇంతకు ముందే ప్రతిపాదనలు పంపించారు. గతంలో ఉన్న గ్రామాలు, వార్డులు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం గ్రామాలు, వార్డుల రిజర్వేషన్లు మారనున్నాయి. సామాజికవర్గాల వారిగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ప్రభుత్వం కొన్ని సామాజికవర్గాలకు రిజర్వేషన్లు పెంచేలా అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని భావించి చివరి నిమిషంలో అసెంబ్లీలో బిల్ పెట్టలేదని తెలుస్తోంది.

సుప్రీంకోర్టు సూచించిన విధంగా
స్థానిక సంస్థల్లో బిసిల రిజర్వేషన్‌ను సుప్రీంకోర్టు సూచించిన విధంగా ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఖరారు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటికే జిల్లా పర్యటనలు, బహిరంగ వినతులు స్వీకరించి నివేదికను ప్రాథమికంగా సిద్ధం చేసింది. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కంప్యూటరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అది పూర్తి కాగానే కమిషన్‌కు డేటా అందిస్తారు. దాని ఆధారంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది. ఆ తర్వాత కేబినెట్ ఆ నివేదికపై చర్చించి ఆమోదించి రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది. అనంతరం గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను ఖరారు చేసి ఎన్నికల కమిషన్‌కు అందించనున్నారు. అనంతరం ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టుగా సమాచారం. వాస్తవంగా రిజర్వేషన్ ప్రకారం బిసిలకు 22 శాతం పార్టీ సీట్లు కేటాయించాలని, దీంతోపాటు జనరల్ స్థానాల నుంచి మరో 20 శాతం సీట్లు పార్టీ పరంగా బిసిలకు సీట్లు పార్టీలోనూ చర్చ జరుపుతున్నట్టుగా తెలిసింది. దీంతో బిసిలకు తామే అధిక సీట్లు కేటాయించామని ప్రభుత్వం ప్రజల్లో చెప్పుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం.

ఎంపిటిసి, జడ్పీటిసిలకు ముందుగా ఎన్నికలు
సర్పంచ్‌లు ఎంపిపి, జడ్పీ చైర్మన్లు, ఎంపిటిసి, జెడ్పీటిసిల పదవీకాలం ముగిసింది. వీటిలో ఎంపిటిసి, జడ్పీటిసిలకు ముందుగా ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలిసింది. అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా సమాచారం. ఎంపిటిసి సభ్యుల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో ఐదింటిని ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీలో చేసిన చట్ట సవరణకు గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మొదట గ్రామీణ స్థానిక సంస్థలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. మున్సిపాలిటీల పదవీ కాలం కూడా జనవరి చివరివారంలో ముగియనుంది.

తెలంగాణలో ఏఏ కులాలు బిసిల్లో ఉన్నాయంటే…
తెలంగాణలో బిసిల్లో అనేక కులాలు ఉన్నాయి. ఈ కులాలను ఏ, బీ, సీ, డీ, ఈ గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏ లో సంచార తెగలు తదితర కులాలకు చెందిన వాళ్లు ఉంటారు. గ్రూప్- బి లో వృత్తిపరమైన సమూహాలు ఉంటాయి. గ్రూప్- సిలో క్రైస్తవమతంలోకి మారిన ఎస్సీలు ఉంటారు.
గ్రూప్- డిలో ఇతర కులాలు ఉన్నాయి. గ్రూప్- ఈ లో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లిం కులాలు ఉంటాయి.
గ్రూప్- బికి 10శాతం రిజర్వేషన్‌లు
ప్రస్తుతం తెలంగాణలో బిసిలకు 29శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. గ్రూప్- ఏకు 7 శాతం, గ్రూప్- బికి 10శాతం, గ్రూప్- సికి 1 శాతం, గ్రూప్- డికి 7 శాతం, గ్రూప్- ఈ 4 శాతంగా రిజర్వేషన్‌లను కేటాయించారు. ప్రస్తుత కులగణన తరువాత ఆయా కులాల సామాజిక, ఆర్థిక, జనాభా, విద్య, ఉపాధి తదితర అంశాలను బేరీజు వేసుకున్న తరువాత ఈ రిజర్వేషన్‌లలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆయా కులాల జీవన స్థితిగతుల ఆధారంగా ఒక గ్రూప్‌లో ఉన్న కులాలను ఇంకో గ్రూప్‌లోకి కూడా మార్చే అవకాశం ఉందని, బిసి కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందని అధికారికవర్గాల సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News