Wednesday, January 22, 2025

సెప్టెంబర్ 10న బిసిల సింహగర్జన సభ

- Advertisement -
- Advertisement -

ఆన్‌లైన్‌లో పేరు నమోదు కార్యక్రమం ప్రారంభించిన జాజుల

మన తెలంగాణ / హైదరాబాద్ : సెప్టెంబర్ 10న హైదరాబాద్ లోని సరూర్‌నగర్ స్టేడియంలో బిసిల సింహగర్జన భారీ బహిరంగ సభ ఉంటుందని బిసి సంక్షేమబ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సభకు వచ్చే బిసీలు ఆన్ లైన్ లో పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాదులోని బిసి భవన్ లో సెప్టెంబర్ 10వ తేదీన జరిగే బిసి సింహగర్జన సభకు హాజరయ్యే బిసి ప్రతినిధులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బిసి ప్రజలు పేర్లు నమోదు చేసుకోవడానికి గాను ఆన్ లైన్  నమోదు కార్యక్రమాన్ని ఇతర బిసి సంఘాల నేతలతో కలిసి ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బిసిల సింహగర్జన సభకు రాష్ట్రంలోని బిసి మేధావులు, ఉద్యోగులు, విద్యార్థులు,మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. బిసి సింహగర్జన మహాసభకు ప్రతి కుటుంబం నుండి ఒకరు కదిలి రావాలని కోరారు. ‘కులానికి ఒక సీటు, బిసీలకే ఓటు, సామాజిక న్యాయం సబ్బండ కులాలకు రాజ్యాధికారం’, అనే నినాదంతో చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో పార్టీల కతీతంగా జెండాల కతీతంగా బిసి సింహగర్జనను పెద్ద ఎత్తు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సింహగర్జనను విజయవంతం చేయడం ద్వారా బిసిలలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడం, బిసిలలో ఐక్యత సాధించి అన్ని రాజకీయ పార్టీల మీద రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం సీట్లు పొందడం, బిసి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించే విధంగా అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవడానికి ఈ మహాసభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం కార్యనిర్వాక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం, రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, బిసి జన సైన్యం రాష్ట్ర అధ్యక్షులు సింగం నగేష్, కనుకుంట్ల విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News