Saturday, December 21, 2024

బిసిల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఆదరణ

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీని బిసి వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారు
కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కెఎస్వీ చారి
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి బిసిల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేక బిఆర్‌ఎస్ నాయకులు బిసి అనే కొత్త కుట్రను తెరమీదకు తీసుకొచ్చారని కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ కెఎస్వీ చారి అన్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ బిసిలను, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కించపరిచినట్లుగా బిఆర్‌ఎస్ నాయకులు ఒక దుష్ప్రచారాన్ని మొదలు పెట్టారని ఆయన ఫైర్ అయ్యారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో బిసి ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు జరిగిన అన్యాయం మీద బిసి ఎమ్మెల్యేలు ప్రశ్నించలేదన్నారు. బిఆర్‌ఎస్ చెందిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముదిరాజుల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడినప్పుడు బిసి మంత్రులు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. జాతీయ బిసి కమిషన్ చైర్మన్‌ను కులం పేరుతో దూషించినప్పుడు బిసి మంత్రులు ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమకారుల్లో 60 శాతం బిసిలు ఉన్నారని, వారికి గుర్తింపు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

Also Read: మణిపూర్‌లో దారుణం జరుగుతోంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News