Sunday, December 22, 2024

బిసిలకు కాంగ్రెస్ మొండి ‘చెయ్యి’

- Advertisement -
- Advertisement -

ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉదయపూర్ డిక్లరేషన్’లో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరు బిసిలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ప్రకటించాడు. దాని ప్రకారం మొత్తం బిసి అభ్యర్థులకు కనీసం 34 టికెట్లు దక్కాలి. ఈ 34 టికెట్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం బిసి విద్యార్థి నేతలు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్న బిసి నాయకులు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసిండ్రు. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బిసిల పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిండు. దీనిపై రేవంత్ రెడ్డి దురుసుగా ప్రతిస్పందిస్తూ ‘సావుదలకు ఏమొచ్చిందని’ లక్ష్మయ్యను ఎద్దేవా చేసి బిసిల మనోభావాలను గాయపరిచిండు. ఈ దశలో కూడా బిఆర్‌ఎస్ కన్నా ఎక్కువ సీట్లే ఇస్తామని కూడా నమ్మబలికిండు. కానీ తీరా 21 సీట్లను మాత్రమే బిసిలకు కేటాయించారు. ఇందులో యాకుత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్టలో గత యాభై ఏండ్లుగా కాంగ్రెస్‌కు ఎన్నడూ డిపాజిట్ రాలేదు. అదే సమయం లో సిట్టింగ్‌లతో కలుపుకొని బిఆర్‌ఎస్ పార్టీ మొత్తం 24 సీట్లను కేటాయించింది.

నవంబర్ 30న జరిగే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇప్పుడు ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నారో స్పష్టంగా లెక్క తేలింది. (నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువున్నది) ఇప్పుడు ఏ సామాజిక వర్గానికి ఏ పార్టీ ఎన్ని సీట్లిచ్చారో కూడా తెలుస్తున్నది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం 44 మంది రెడ్లకు టికెట్లివ్వగా, భారత రాష్ర్ట సమితి (బిఆర్‌ఎస్) 42 మంది రెడ్లను తమ పార్టీ తరపున పోటీకి దింపింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ 21 మంది బిసిలకు టికెట్లివ్వగా బిఆర్‌ఎస్ 24 మంది బిసిలకు టికెట్లిచ్చింది. భారతీయ జనతా పార్టీ బిసిని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినప్పటికీ దాని ప్రభావం అంతగా లేదు. ఉన్న బిసి అధ్యక్షుణ్ణి తొలగించడంతో వారు చెప్పే మాటలను ఓటర్లు నమ్మడం లేదు. ఏతా వాతా తేలేదేమిటంటే పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య దాదాపు వంద సీట్లల్లో ముఖాముఖి ఉండనుంది.

ఈ రెండు పార్టీలు బిసిల ఓట్ల కోసం పాటు పడుతున్నాయి. బిసిల కోణం నుంచి ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరమున్నది. అందుకే ఈ విశ్లేషణ. బిసిల పట్ల ఏ పార్టీ వైఖరి ఎట్లా ఉన్నదో చర్చించుకోవాల్సిన అవసరమున్నది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘ఉదయపూర్ డిక్లరేషన్’లో భాగంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరు బిసిలకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని ప్రకటించాడు. దాని ప్రకారం మొత్తం బిసి అభ్యర్థులకు కనీసం 34 టికెట్లు దక్కాలి. ఈ 34 టికెట్ల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం బిసి విద్యార్థి నేతలు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉన్న బిసి నాయకులు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసిండ్రు. ఈ దశలో కాంగ్రెస్ పార్టీ బిసిల పట్ల అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిండు. దీనిపై రేవంత్ రెడ్డి దురుసుగా ప్రతిస్పందిస్తూ ‘సావుదలకు ఏమొచ్చిందని’ లక్ష్మయ్యను ఎద్దేవా చేసి బిసిల మనోభావాలను గాయపరిచిండు.

ఈ దశలో కూడా బిఆర్‌ఎస్ కన్నా ఎక్కువ సీట్లే ఇస్తామని కూడా నమ్మబలికిండు. కానీ తీరా 21 సీట్లను మాత్రమే బిసిలకు కేటాయించారు. ఇందులో యాకుత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్టలో గత యాభై ఏండ్లుగా కాంగ్రెస్‌కు ఎన్నడూ డిపాజిట్ రాలేదు. అదే సమయం లో సిట్టింగ్‌లతో కలుపుకొని బిఆర్‌ఎస్ పార్టీ మొత్తం 24 సీట్లను కేటాయించింది. ఇందులో ఒక్క నాంపల్లి తప్ప అన్నింటిలోనూ బిఆర్‌ఎస్ గట్టి పోటీ ఇవ్వనుంది. బిఆర్‌ఎస్ ముదిరాజ్‌లకు ఒక్క సీటు ఇవ్వకున్నా తాము నలుగురు ముదిరాజ్‌లకు సీట్లిచ్చినాము అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. తెల్లారే నీలం మధు ముదిరాజ్‌కు టికెట్ ఇచ్చి బిఫావ్‌ు మాత్రం కాటా శ్రీనివాస్ గౌడ్‌కు ఇచ్చిండ్రు. అంటే నమ్మించి మోసం చేయడమే.

ముగ్గురు ముదిరాజ్ అభ్యర్థుల్లో గోషామహల్, రాజేంద్రనగర్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు గత నాలుగు ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. వాకిటి శ్రీహరి ఒక్కరు మాత్రమే మక్తల్‌లో కొంచెం గట్టి పోటీ నివ్వగలరు. ఇక్కడే ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీ తరపున మొన్న నవంబర్ పదో తారీఖు నాడు ‘బిసి డిక్లరేషన్’ని రేవంత్ రెడ్డి, సిద్ధరామయ్యలు విడుదల చేసిండ్రు. అంటే స్టేట్ కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోదగ్గ బిసి నాయకుడు లేడు అనే సంకేతమివ్వడమే! అంతేగాదు ఆ పార్టీ ప్రచార ప్రకటనల్లో కేవలం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కుల ఫోటోలను వాడడమంటే మాకు బిసిలతో సంబంధం లేదని తేల్చి చెప్పడమే!

ప్రస్తుత అసెంబ్లీలో బిఆర్‌ఎస్ పార్టీకి 21 మంది (2018లో బిఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ని మినహాయించి) అభ్యర్థులున్నారు. ఇందులో గంప గోవర్ధన్ మినహా మిగతా అందరికీ టికెట్లు దక్కాయి. కామారెడ్డిలో గంప గోవర్ధన్ గెలిచిన స్థానం నుంచి స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బరిలో ఉన్నాడు. వీరితో పాటు సంగారెడ్డి, మంథనిలలో బిసిలైన చింతా ప్రభాకర్, పుట్టా మధులు ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. నాంపల్లి నుంచి ఆనంద కుమార్ గౌడ్ పోటీలో ఉన్నాడు. ఇక్కడ బిఆర్‌ఎస్ విజయావకాశాలు అంతంత మాత్రమే. ఎందుకంటే ఇక్కడ మజ్లిస్ బలంగా ఉన్నది.

ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి మూడు కూడా బిసి అభ్యర్థులను ప్రకటించిన నియోజక వర్గాలు మొత్తం ఐదున్నాయి. అంటే ఈ నియోజక వర్గాల నుంచి ఎవరు గెలిచినా బిసిలే ఎంఎల్‌ఎలుగా ఉండనున్నారు. అవి రామగుండం, కరీంనగర్, షాద్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్. ఇక రెండు ప్రధాన పార్టీల తరపున బిసిలు పోటీ పడుతున్న నియోజక వర్గాలు మొత్తం 13 ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్, ముథోల్, సంగారెడ్డి, పటాన్‌చెరువు, కుత్బుల్లాపూర్, అంబర్‌పేట, కల్వకుర్తి, నిజామాబాద్ (రూరల్)లలో బిఆర్‌ఎస్, బిజెపిలు బిసి అభ్యర్థులను పోటీలోకి దింపాయి. అట్లాగే రాజేంద్రనగర్, గద్వాల, వరంగల్ ఈస్ట్‌లలో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ బిసిలను పోటీలోకి దింపిండ్రు. ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు బిసిలను బరిలో నిలిపాయి.

అట్లాగే ఓల్డ్ సిటీని మినహాయిస్తే మొత్తం 23 నియోజక వర్గాల్లో ఏకైక బిసిలుగా ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. ఇందులో బిఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ స్థానాలు ఎల్లారెడ్డి, సనత్‌నగర్, మహబూబ్‌నగర్, నాగార్జునసాగర్, కొత్తగూడెం, ఖైరతాబాద్, వరంగల్ వెస్ట్, కోదాడ నియోజక వర్గాల నుంచి బిసిలు పోటీ చేస్తున్నారు. అట్లాగే మంథని, సంగారెడ్డిల నుంచి కూడా గతంలో ఓడిపోయిన తమ బిసి అభ్యర్థులను బరిలోకి దింపింది. అంటే వీరి ప్రధాన ప్రత్యర్థులందరూ అగ్రకులాల వారే!
కాంగ్రెస్ తరపున ఎల్.బి.నగర్, మక్తల్, వేములవాడ, హుస్నాబాద్‌లలో బిసిలు పోటీ చేస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా బిఆర్‌ఎస్, బిజెపి రెండు పార్టీలు కూడా అగ్ర కులాలకు చెందిన వారికి టికెట్లను కేటాయించింది. అట్లాగే బిజెపి నుంచి బాన్స్‌వాడ, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, జడ్చర్ల, గజ్వెల్, హుజురాబాద్, జగిత్యాలల నుంచి బిసి అభ్యర్థులను నిలబెట్టింది. వీరి ప్రధాన ప్రత్యర్థులు అగ్రకులాల వాండ్లు.

ఏ లెక్కన చూసుకున్నా గెలిచే స్థానాల్లో బిసిలకు ఎక్కువ టికెట్లిచ్చింది భారత రాష్ర్ట సమితి. అత్యల్ప గెలిచే సీట్లను కేటాయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే భారతీయ జనతా పార్టీ 36 సీట్లు బిసిలకు ఇచ్చినప్పటికీ అందులో మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు దక్కడమే కష్టం. అట్లాగే బహుజన సమాజ్ పార్టీ అన్ని పార్టీల కన్నా బిసిలకు ఎక్కువ టికెట్లను కేటాయించినప్పటికీ అందులో ఒక్క పెద్దపల్లి నియోజకవర్గంలో మాత్రమే గట్టి పోటీ ఇచ్చే అవకాశమున్నది.

నివాస్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News