Wednesday, January 22, 2025

బిసి ఓట్లే కీలకం

- Advertisement -
- Advertisement -

ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్ , రెండు స్థానాలు కేటాయించిన బిఆర్‌ఎస్
బిసి డిక్లరేషన్ వేదికగా ఉన్న జిల్లాకే మొండి చేయి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ బిసి ఓట్లే కీలకంగా మారాయి. వారే గెలుపు ఓటములను నిర్ణయించేది. అందుకే బిసి ఓట్ల కోసం ప్రధాన పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తున్నాయి. ఓట్ల కోసం బిసి మంత్రం జపిస్తున్న పార్టీలు టిక్కెట్లు కేటాయించే విషయంలో మాత్రం మోహం చాటేస్తున్నారు. బిసిలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. ఇది వరకు జిల్లాలో ప్రధాన పార్టీలు మూడు నుంచి నాలుగు నియోజక వర్గాల్లో బిసిలకు టిక్కెట్లు ఇచ్చేవి కాని క్రమేపి ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తున్నా యి. నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొ ండ, ఆర్మూర్ నియోజక వర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజక వర్గంలో ఒకొక్క సామాజిక వర్గం ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి.

నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాన్సువాడ, ఆర్మూర్ నియోజక వర్గాల్లో మున్నూరుకాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది. గతంలో ఈ నియోజక వర్గంలో ఈ సామాజిక వర్గంకు చెందిన నేత లు ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. అలాగే బాల్కొ ండలో పద్మశాలిలు, ఎల్లారెడ్డిలో ముదిరాజు సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని 9 నియోజక వర్గాల్లో బిసి ఓటర్లు ఎంత మంది ఉన్నారనేది అధికారిక లెక్కలు లేకపోయినప్పటికీ 60 నుంచి 65 శాతం వరకు బిసి ఓటర్లు ఉంటారనేది ఒక అంచనాగా చెప్తున్నాయి. ఒక అర్బన్‌లోనే దాదాపు 32 శాతం ముస్లీం ఓటర్లు ఉంటే దాదాపు 20 శాతం మేరకు మున్నూరుకాపు ఓట్లు ఉండడం గమనార్హం. అధికారంలోకి వస్తే బిసి డిక్లరేషన్ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్ ఒక్కటి అంటే ఒక్కటే బిసిలకు టికెట్ ఇవ్వలేకపోయింది.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వేదికగా బిసి డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ జిల్లాలో ఒక్క సీటు కూడ బిసిలకు ఇవ్వలేకపోయింది. పేరుకు జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాలున్నా జిల్లాలో ఒక్క నియోజక వర్గంలోనూ బిసికి టిక్కెట్ ఇవ్వకపోవడంపై బిసి సంఘాలు రగిలిపోతున్నాయి. 2018 ఎన్నికల్లో నాలుగు నియోజక వర్గాలను బిసిలకు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఆ వర్గాలకు ఎందుకు మొండి చేయ్యి ఇచ్చిందనే ఎవ్వరికి అంతు చిక్కడం లేదు. ఏకంగా అయిదు నియోజక వర్గాల్లో పొరుగు పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చినప్పటికి బిసి సామాజిక ప్రాధాన్యతను మాత్రం గాలికి వదిలేసింది. నిజానికి ప్రతి లోకసభ నియోజక వర్గ పరిధిలో కనీ సం రెండు అసెంబ్లీ నియోజక వర్గాలను బిసిలకు కేటాయిస్తామని స్వయంగా రాహుల్ గాంధీ అనేక సార్లు ప్రకటించారు.

అవే అంశాన్ని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ప్రస్తావించినప్పటికి ఇప్పుడు సామాజిక ప్రాధాన్యత పట్టించుకోవద్దు. గెలుపు గుర్రాలకే గుడ్డిగా టిక్కెట్ ఇస్తామని తెగేసి చెప్పారు. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ లాంటి నేతలే నిస్సహాయుడిగా రేసు నుంచి తప్పుకున్నారు. బాల్కొండ నియోజక వర్గం నుంచి 2018లో పోటీ చేసిన మాజీ విఫ్ అనిల్ ఈరవత్రి సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఆయనకు టికెట్ ఇవ్వడానికి ససేమిరా అన్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గంకు చెందిన కాసుల బాలరాజు టికెట్ దక్కక పోవడంతో ఆయన కార్యకర్తల సమక్షం లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వారం రోజుల పాటు ఆయన పోరాడిన పిసిసి స్థాయి నేతల పరామర్శకు నోచుకోలేదు. నిజానికి బాల్‌రాజ్ గతంలో 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.

అదే సాకుతో ఈసారి టికెట్ ఇవ్వడానికి నిరాకరిం చి ఎల్లారెడ్డిలో 30 వేల తేడాతో ఓడిపోయిన ఏనుగు రవీందర్‌రెడ్డి బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన నాలుగు రోజులకే టికెట్ ఇవ్వడంతో బాన్సువాడ నియోజక వర్గం మున్నూరు కాపులు రగిలిపోతున్నారు. టిక్కెట్ల కోసం చివరి దాకా ప్రయత్నాలు సాగించి విఫలం అయిన మహేష్ గౌడ్, అనిల్, బాల్‌రాజ్ లాంటి సీనియర్ బిసి నేతలు తమ నియోజక వర్గంలో ఎన్నికల కార్యా క్షేత్రంలో చురుకుగా వ్యవహరించడం లేదు. 2018 ఎన్నికల్లో కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్‌కు నిజామాబాద్ రూరల్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌లు బిఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఘన విజయం సాధించగా గంప గోవర్ధన్ విప్‌గా గోవర్ధన్ టిఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా నియామకం అయ్యారు.

కాని ఈసారి కామారెడ్డిలో బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ స్వయంగా పోటీ చేస్తున్నారు. కాని నియోజక వర్గ ఎన్నికల బాధ్యతను గంప భుజాల మీదే పెట్టారు. కాని ఎల్లారెడ్డిలో సురేందర్‌కు టిక్కెట్ దక్కింది. గంపకు టిక్కెట్ మిస్ అయినప్పటికీ బిఆర్‌ఎస్ ఉమ్మడి జిల్లాలో ఇద్దరు బిసిలకు అదికూడ కీలకమైన మున్నూరు కాపు సామాజిక వర్గాలకే కేటాయించింది. దీంతో ఆ పార్టీ గతంలో ఇచ్చిన రెండు సీట్ల ను ఈసారి ఎన్నికల్లోనూ కొనసాగించింది.

(ఎ. రామకృష్ణ ప్రసాద్/నిజామాబాద్ బ్యూరో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News