ఢాకా: ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే బంగ్లాదేశ్ జట్టుకు షకీబ్ అల్ సారథిగా వ్యవహరించనున్నాడు. బంగ్లా కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ప్రకటించింది. బిసిబి చీఫ్ నజ్మల్ హసన్‌తో షకీబ్ భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. మరోవైపు ఆసియాకప్‌లో పాల్గొనే టీ20 బంగ్లాజట్టులో బిసిబి కీలక మార్పులు చేసింది. లిటన్‌దాస్ గాయాల కారణంగో టోర్నీకి దూరమయ్యాడు. షకీబ్‌కు తిరిగి జట్టు పగ్గాలు అందించడంతోపాటు ముష్ఫికర్ రహీమ్, మొహమ్మద్ సైఫుద్దిన్, నూరుల్ హసన్ తిరిగి జట్టులో చేరనున్నారు.వీరితోపాటు హార్డ్‌కోర్ హిట్టర్ సబ్బీర్ రహమాన్‌కు కూడా జట్టులో స్థానం లభించింది. ఆసియాకప్‌తోపాటు టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టుకు కూడా షకీబ్ సారథ్యం వహించనున్నాడని బిసిబి క్రికెట్ ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ మీడియాకు తెలిపారు. కాగా బంగ్లా మాజీ కెప్టెన్ షకీబ్ 2009-10లో జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అయితే అవినీతి ఆరోపణలపై సమాచారం అందించకపోవడంతో ఐసీసీ అతడిని సస్పెండ్ చేసింది. అనంతరం మళ్లీ జట్టులో చేరాడు. షకీబ్ 21మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా బంగ్లాదేశ్ ఏడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. బెట్టింగ్ కంపెనీగా పేరున్న బెట్విన్నర్ న్యూస్ నుంచి షకీబ్ వైదొలగడంతో అతడి పునరాగమనానికి లైన్ క్లియర్ అయింది.
ఆసియాకప్‌లో పాల్గొనే బంగ్లాజట్టు ఇదే..
షకీబ్ అల్ (కెప్టెన్), అనాముల్ హక్ బిజోయ్, ముష్ఫికర్ రహీమ్, అఫిఫ్ హోసెన్, మొసాదిక్ సైకత్, మొహమ్ముదుల్లా రియాద్, ముస్తాఫిజుర్ రహమాన్, నౌసమ్ అహ్మద్, సబ్బీర్ రహమాన్, మెహదీ హాసన్ మిరాజ్, ఎబాదత్ పర్వేజ్ హోసెన్ ఎమాన్, నూరుల్ హసన్ సోహాన్, తస్కిన్ అహ్మ్దద్.
BCB Announces Team for Asia Cup 2022