Thursday, February 20, 2025

భార్యలు వచ్చేందుకు అనుమతి.. కానీ ఒక షరతుపై: బిసిసిఐ

- Advertisement -
- Advertisement -

తమ భార్యలు స్టాండ్స్ నుంచి ప్రోత్సహిస్తుంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు మైదానంలో ఎలా రెచ్చిపోతారో అందరికి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా విదేశీ పర్యటనలకు కుటుంబసభ్యులను తీసుకుపోరాదని బిసిసిఐ స్పష్టం చేసింది. దీంతో కుటుంబసభ్యులు లేకుండానే భారత ఆటగాళ్లు బార్డర్-గవాస్కర్ ట్రోఫీకి వెళ్లారు.

అయితే ఈ బార్డర్-గవాస్కర్ ట్రోఫీ ఓటమి తర్వాత బిసిసిఐ తమ నిబంధనలను కాస్త సడలించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆటగాళ్లకు బిసిసిఐ స్వల్ప ఊరట కల్పించినట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి తమ భార్యలను తోడుగా తీసుకువెళ్ల వచ్చు అంటూ బిసిసిఐ ప్రకటంచిందని.. కానీ, దానికి కూడా ఒక షరతును విధించినట్లు సమాచారం.

అదేంటంటే.. ఆటగాళ్లు కేవలం ఒక మ్యాచ్‌కి మాత్రమే తమ కుటుంబసభ్యులను తీసుకువెళ్లాలని బిసిసిఐ తెలిపిందట. సాధారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ వంటి చిన్న టూర్‌లకు కుటుంబసభ్యులను తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. 45 రోజులకు మించిన టూర్‌లకే కుటుంబసభ్యులను తీసుకువెళ్లాలనే నిబంధన ఉంది. కానీ, ఈవెంట్ యొక్క స్వభావాన్ని పరిగణలోకి తీసుకొని బోర్డు ప్రతి క్రీడాకారుడు ఒక ఆట కోసం కుటుంబ సభ్యుల కంపెనీని కలిగి ఉండటానికి అనుమతించినట్లు టాక్. ఆటగాళ్లు దీనిపై చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చి.. బిసిసిఐకి అభ్యర్థన పెట్టుకోవాలి.

ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు భారత్ జట్టు ఇప్పటికే దుబాయ్ చేరుకుంది. ఈ టోర్నమెంట్‌ని బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ఆరంభించనున్న భారత్.. ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఆ తర్వాత మార్చి 2వ తేదీన న్యూజిలాండ్‌తో పోరుకు దిగనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News