ముంబై: వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాపై విమర్శల వర్షం కురుస్తోంది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి తదితరులను వరల్డ్‌కప్ జట్టులో ఎంపిక చేయడాన్ని క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించిన దీపక్ చాహర్, పృథ్వీషా, శిఖర్ ధావన్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లను ఎంపిక చేయకుండా అంతంత మాత్రంగానే రాణించిన ఆటగాళ్లను వరల్డ్‌కప్ జట్టులో చోటు కల్పించడాన్ని వారు తప్పుపడుతున్నారు. హార్దిక్, వరుణ్‌లను లక్షంగా చేసుకుని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏమాత్రం ఫామ్‌లో లేని హార్దిక్‌ను ఎందుకు ఎంపిక చేశారో సెలెక్టర్లకే తెలియాలని వారు పేర్కొంటున్నారు. వరుణ్, రాహుల్ చాహర్‌లకు కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించడాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ధావన్, పృథ్వీషా, శాంసన్, త్రిపాఠి, పడిక్కల్, రుతురాజ్ తదితరులు ఐపిఎల్‌లో నిలకడైన ప్రదర్శన చేశారని, అయినా వారిపై చిన్నచూపు చూడడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.
వరల్డ్‌కప్‌కు ఎంపికైన జట్టు వివరాలు
విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కెఎల్.రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమి, రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి.
స్టాండ్‌బై ఆటగాళ్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్.
BCCI announced Team India for T20 World Cup