ముంబై: శ్రీలంకతో సొంతగడ్డపై జరిగే సిరీస్‌లో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) స్వల్ప మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం తొలుత ట్వంటీ20 సిరీస్ జరుగుతుంది. ఇది ముగిసిన తర్వాత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను నిర్వహిస్తారు. ఇంతకుముందు తొలుత టెస్టు సిరీస్‌ను నిర్వహించాలని బిసిసిఐ భావించిన. అయితే తాజాగా సిరీస్ నిర్వహణలో మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా షెడ్యూల్‌ను మంగళవారం బిసిసిఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు టి20 సిరీస్ జరుగుతుంది. ఇక మార్చి 4 నుంచి 16 టెస్టు సిరీస్‌ను నిర్వహిస్తారు. తొలి టి20 ఫిబ్రవరి 24న లక్నో వేదికగా జరుగనుంది. తర్వాతి రెండు టి20లకు ధర్మశాల వేదికగా నిలువనుంది.
బెంగళూరులో డేనైట్ టెస్టు
మరోవైపు మొదటి టెస్టు మ్యాచ్ మొహాలీలో జరుగనుంది. ఇది మార్చి 4న ఆరంభమవుతోంది. పంజాబ్ క్రికెట్ సంఘం దీనికి ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు బెంగళూరు వేదికగా రెండో టెస్టును నిర్వహిస్తున్నారు. డేనైట్ ఫార్మాట్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
BCCI Announces IND vs SL Schedule Revised