ముంబై: ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం టీమిండియాను మంగళవారం ప్రకటించారు. విరాట్ కోహ్లిని తిరిగి కెప్టెన్‌గా ఎంపిక చేశారు. తొలి రెండు టెస్టుల కోసం జట్టును బిసిసిఐ ప్రకటించింది. గాయాలతో ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరంగా ఉన్న ఇషాంత్ శర్మ, కెఎల్ రాహుల్‌కు జట్టులో చోటు కల్పించింది. హార్దిక్ పాండ్య కూడా స్థానం కల్పించారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాణించిన సిరాజ్, వాషింగ్టన్ సుందర్‌లు కూడా జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అక్షర్ పటేల్‌కు తొలిసారి టెస్టులకు ఎంపిక చేశారు. బుమ్రా, శార్దూల్, సాహా, గిల్, రోహిత్, పంత్‌లను కూడా జట్టులో చోటు దక్కింది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి ఐదు నుంచి జరుగనుంది.
తొలి రెండు టెస్టులకు భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పూజారా, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ఆక్సర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్.
BCCI Announces India Squad for first 2 tests against Eng