Sunday, December 22, 2024

టీ20 వరల్డ్ కప్ 2024కు భారత జట్టు ప్రకటన.

- Advertisement -
- Advertisement -

టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును బిసిసిఐ ప్రకటించింది. హిట్ మ్యాన్ రోహిత్ సారథ్యంలో 15 మంది సభ్యుల బృందాన్ని మంగళవారం వెల్లడించింది. జట్టులో యువ క్రికెటర్లు శివం దూబే, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ చోటు దక్కగా.. యువ సంచలనాలు రింకూ సింగ్, ఇషన్ కిషన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మలకు నిరాశే ఎదురైంది. వీరితోపాటు కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గ్వైకాడ్, శుభ్ మన్ గిల్ లను బోర్డు పక్కన పెట్టింది. ఇక, కారు ప్రమాదంతో ఏడాదన్నర పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం ఐపిఎల్ లో పంత్ ధనాధన్ బ్యాటింగ్ చెలరేగుతున్నాడు. జడేజా, బుమ్రా, కుల్దీప్, చాహల్, అర్షదీప్, అక్షర్ పటేల, సిరాజ్ లను ఈ మెగా టోర్నికి ఎంపిక చేశారు.

కాగా.. అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో ఈ మెగా టోర్నీ జూన్ 1 ప్రారంభం కానుంది.మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో  పాల్గొననున్నాయి. జూన్ 29న ఫైనల్ మ్యాచ్ తో వరల్డ్ కప్ ముగియనుంది. భారత తన తొలి మ్యాచ్ లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది.

టీమిండియా జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News