Thursday, January 23, 2025

పుజారాపై వేటు

- Advertisement -
- Advertisement -

ముంబై : వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండి యా టెస్టు, వన్డే జట్లను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం ప్రకటించింది. టెస్టు జట్టు నుంచి సీనియర్ బ్యాటర్, మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారాకు ఉద్వాసన పలికారు. యువ క్రికెటర్లు యశస్వి జైస్వా ల్, రుతురాజ్‌లకు టెస్టు జట్టులో స్థానం లభించింది. ఇక వన్డేల్లో సంజూ శాంసన్ తిరిగి ఎంపికయ్యాడు. యువ ఫాస్ట్‌బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా తొలిసారి వన్డే టీమ్ లో చోటు దక్కించుకున్నాడు. టెస్టు, వన్డే జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక టెస్టుల్లో అజింక్య రహానె, వన్డేల్లో హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్‌లుగా ఎంపికయ్యా రు. కాగా, జులై 12 నుంచి ఆగస్టు 13 వరకు విండీస్‌లో టీమిండియా పర్యటించనుంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు, మరో ఐదు టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇదిలావుంటే టి20 టీమ్‌ను ఇంకా ప్రకటించలేదు.
ఊహించిందే..
ఇటీవల జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్ ఫైనల్లో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరిచిన సీనియర్ బ్యాటర్ చటేశ్వర్ పుజారాకు ఊహించినట్టే షాక్ తగిలింది. కొంతకాలంగా పుజారా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. డబ్లూటిసి ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌లలో కూడా ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో అతనికి వెస్టిండీస్‌లో పాల్గొంటున్న టీమిండియాలో చోటు దక్కలేదు. కౌంటీ క్రికెట్‌లో ఆడినా పుజారా డబ్లూటిసి ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. భారీ ఆశలు పెట్టుకున్న పుజారా పేలవమైన బ్యాటింగ్‌తో నిరాశ పరిచాడు. దీంతో అతనిపై సెలెక్టర్లు వేటు వేశారు. మరోవైపు ఐపిఎల్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో అలరించిన యశస్వి జైస్వాల్‌కు టెస్టు టీమ్‌లో చోటు లభించింది. ఐపిఎల్‌లో రాజస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన యశస్వ పరుగుల వరద పారించాడు. అంతేగాక దేశవాళీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు.

దీంతో విండీస్‌తో జరిగే టెస్టులకు అతన్ని ఎంపిక చేశారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ కూడా టెస్టు జట్టులో చోటు సంపాదించాడు. ఐపిఎల్‌లో రుతురాజ్ అసాధారణ బ్యాటింగ్‌తో అలరించాడు. చెన్నై ఐపిఎల్ ట్రోఫీ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు రుతురాజ్‌కు టెస్టు జట్టులో చోటు సంపాదించారు. మరోవైపు తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ వికెట్ కీపర్‌గా టీమిండియాలో స్థానం దక్కించుకున్నాడు. అతనితో పాటు ఇషాన్ కిషన్ కూడా వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. కాగా, సీనియర్ ఫాస్ట్ బౌలర్ షమికి సిరీస్‌లో విశ్రాంతి కల్పించారు. ముకేశ్ కుమార్, నవ్‌దీప్ సైనీలు కూడా టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలతో పాటు అక్షర్ పటేల్‌లకు విండీస్ సిరీస్‌లో చోటు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News