Saturday, November 16, 2024

దేశవాళీ క్రికెట్ షెడ్యూల్ ఖరారు

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశవాళీ క్రికెట్‌కు సంబంధించిన కొత్త సీజన్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) ఖరారు చేసింది. సెప్టెంబర్ నుంచి 202122 దేశవాళీ క్రికెట్ సీజన్ ప్రారంభమవుతోంది.సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీతో కొత్త సీజన్‌కు తెరలేవనుంది. ఇక కరోనా కారణంగా కిందటి సీజన్‌లో నిర్వహించని రంజీ ట్రోఫీని ఈసారి ఎలాగైన నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించింది. భారత క్రికెట్‌లోనే అత్యంత కీలకమైన రంజీ ట్రోఫీని కరోనా కారణంగా కిందటిసారి నిర్వహించలేక పోయారు. ఈసారి మాత్రం డిసెంబర్ నుంచి మూడు నెలల పాటు రంజీ ట్రోఫీని నిర్వహించేందుకు బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు బిసిసిఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకన్నారు. ఈసారి దులీప్ ట్రోఫీ, దియోధర్ ట్రోఫీ, ఇరానీ కప్‌లను నిర్వహించడం లేదు. సీనియర్ పురుషుల విభాగంలో ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారె ట్రోఫీ, రంజీ ట్రోఫీలను నిర్వహిస్తున్నారు. సీనియర్ మహిళల విభాగంలో టి20 లీగ్, వన్డే లీగ్‌లను నిర్వహించాలని కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు.

Domestic Cricket Schedule released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News