Wednesday, January 22, 2025

విండీస్ తో వన్డే, టీ20 సిరీస్ లకు భారత జట్టు ప్రకటన..

- Advertisement -
- Advertisement -

BCCI announces India's ODI and T20 Squad against WI

ముంబై: స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ లకు బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ లకు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో మొత్తం 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. కెఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. వన్డే, టీ20 సిరీస్ నుంచి టీమిండియా సీనియర్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీలకు విశ్రాంతి ఇచ్చారు. గాయం కారణంగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మొత్తం సరీస్ కు దూరం కాగా.. స్టార్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు బిసిసిఐ పేర్కొంది. టీ20 సిరీస్ కు అక్షర్ పటేల్ ను సెలెక్ట్ చేశారు. వచ్చే నెల 6 నుంచి విండీస్ సిరీస్ ఆరంభం కానుంది. విండీస్‌తో భారత్ మూడు వన్డేలు, మరో మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్(వికెట్ కీపర్), దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, యుజ్వేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, ప్రసీద్, అవేష్ ఖాన్.

భారత్ టీ20 జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్ధూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజ్వేందర్ చాహల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్.

BCCI announces India’s ODI and T20 Squad against WI

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News