Saturday, November 16, 2024

బిసిసిఐకి కాసుల పంట

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా సంఘంగా పేరున్న భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ)కి మరోసారి కాసుల పంట పండింది. ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్న మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల ఎంపిక కోసం జరిగిన వేలం పాట బిసిసిఐపై కనక వర్షం కురిపించింది. ఐదు ఫ్రాంచైజీల ద్వారా బిసిసిఐ ఏకంగా రూ.4670 కోట్లను ఆర్జించింది. ఈ విషయాన్ని బిసిసిఐ కార్యదర్శి జైషా బుధవారం అధికారికంగా ప్రకటించారు. వేలం పాటలో ఐదు బడా పారిశ్రామిక వేత్తలు వందలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఫ్రాంచైజీలను సొంతం చేసుకున్నాయి.

అదానీ స్పోర్ట్‌లైన్ రూ.1,289 కోట్లను వెచ్చించి అహ్మదాబాద్ టీమ్‌ను దక్కించుకుంది. ముంబై టీమ్‌ను ఇండియావిన్ స్పోర్ట్ రూ.913 కోట్లకు, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్ రూ.901 కోట్లకు బెంగళూరు జట్టును, జెఎస్‌డబ్లూ జిఎంఆర్ క్రికెట్ రూ.810 కోట్లను వెచ్చించి ఢీల్ల ఫ్రాంచూజీని దక్కించుకున్నాయి. ఇక కాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ రూ.757 కోట్లను వెచ్చించి లక్నో టీమ్‌ను సొంతం చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News