- Advertisement -
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో ప్రతిష్టాత్మక సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (రూపే) ఒప్పందం కుదుర్చుకొంది. రానున్న మూడేళ్ల పాటు ఐపిఎల్‌కు రూపే అధికారిక భాగస్వామ్య సంస్థగా వ్యవహరించనుంది. ఈ మేరకు గురువారం ఐపిఎల్‌తో చేతులు కలిపింది. దీని కోసం రూపే సంస్థ ఏడాదికి రూ.42 కోట్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఇక మార్చి 26 నుంచి భారత్ వేదికగా జరిగే ఐపిఎల్‌కు భారత్ కార్పొరేట్ దిగ్గజం టాటా టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. దీంతో పాటు డ్రీమ్ 11, అన్ అకాడమీ,క్రెడ్, పెటిఎం, స్వగ్గీ ఇన్సంట్, సియట్, అప్సాక్స్ తదితర సంస్థలు అఫిషియల్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రూపే కూడా ఐపిఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం.
- Advertisement -